Viral Video: అందమైన ప్రేమరాణితో రాజమౌళి స్టెప్పులు.. జక్కన్నలో ఈ టాలెంట్ కూడా ఉందా?

Viral Video: అందమైన ప్రేమరాణితో రాజమౌళి స్టెప్పులు.. జక్కన్నలో ఈ టాలెంట్ కూడా ఉందా?

దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) గురించి, ఆయన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సాధించిన విజయాలు చూస్తే చాలు అర్థమవుతుంది. బాహుబలి సినిమాతో తెలుగు సినీ ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసిన జక్కన్నా.. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా ఆస్కార్ అవార్డును సాధించాడు. అది రాజమౌళి రేంజ్. ఒక సీరియల్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన ఆయన.. ప్రస్తుతం పపంచవ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకున్నారు. 

అయితే.. తన సినిమాల్లో ఒక సన్నివేశాన్ని ఎలా స్క్రీన్ పైకి తీసుకురావాలో రాజమౌళికి బాగా తెలుసు. తాను అనుకున్నది వచ్చేవరకు చెక్కుతూనే ఉంటాడు కాబట్టి.. ఆయన్నీ ప్రేమగా జక్కన్నా అని పిలుచుకుంటారు. అలాంటి జక్కన్న.. మెగాఫోన్ ను పక్కన పెట్టి తన భార్యతో డాన్స్ ఫ్లోర్ పై క్యూట్ స్టెప్స్ వేస్తే ఎలా ఉంటుంది. భలేగా ఉంటుంది కదా. అలాంటి వీడియోనే ఇప్పుడు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రాజమౌళి తన భార్య రామా రాజమౌళితో కలిసి.. అందమైన ప్రేమరాణి చేయితగిలితే అనే పాటకు క్యూట్ స్టెప్స్ వేశారు. భార్య చెయ్యిపట్టుకొని అలా అలా తుప్పుతూ భలే డాన్స్ చేశారు జక్కన్న. 

ప్రస్తుతం ఈ వీడేమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ కూడా రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. జక్కన్న డైరెక్షనే కాదు డాన్స్ కూడా చేస్తారా? అబ్బో.. రాజమౌళి గారిలో ఈ టాలెంట్ కూడా ఉందా? సార్.. మీరు డైరెక్షన్ మానేసి హీరోగా చేయండి.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక రాజమౌళి సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఏ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది.