నాటు నాటు ఆస్కార్ వెనక కార్తికేయ వ్యూహం ఏంటి?

నాటు నాటు ఆస్కార్ వెనక కార్తికేయ వ్యూహం ఏంటి?

దేశ సినీ పరిశ్రమ సంబరాల్లో ముంనిగిపోయింది. ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాటతో పాటు మరికొన్ని సినిమాలకు ఆస్కార్ రావడంతో అందరూ సెలబ్రెట్ చేసుకుంటున్నారు. అయితే, ఈ పాట ప్రపంచ వేదికలను పంచుకోవడానికి, ఇంతటి ఘన విజయాన్ని సాధించడానికి కారణం ఎవరన్నది రాజమౌళి వివరించారు. కీరవాణి ఆస్కార్ వేదికపై అవార్డు అందుకుంటూ.. రాజమౌళి కొడుకు కార్తికేయకు థ్యాంక్స్ చెప్పాడు. దాంతో అందరి దృష్టి కార్తికేయపై పడింది. భారత్ లో ట్రిబుల్ ఆర్ ఘన విజయం సాధించిన తర్వాత.. దీన్ని గ్లోబల్ మార్కెట్ కు తీసుకెళ్లడంలో కార్తికేయదే పెద్ద పాత్ర. గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ కోసం అతనే దగ్గరుండి ప్రమోషన్స్ చేశాడు. మొదట భారత్ తరఫున ఆర్ఆర్ఆర్ కు అధికారిక ఎంట్రీ లభించకపోవడంతో జనరల్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ ను ఆస్కార్ పంపి క్యాంపెయిన్ నిర్వహిచాడు.