రాజమౌళిని మెప్పించిన ప్రథమేష్

రాజమౌళిని మెప్పించిన ప్రథమేష్

భారత ఆర్చరీ ఆటగాడు ప్రథమేష్ సమాధాన్ జావ్కర్ పై టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించాడు. తాజాగా షాంగైలో జరిగిన ఆర్చరీ వరల్డ్ కప్ లో ప్రథమేష్ గోల్డ్ మెడల్ సాధించాడు. మహారాష్ట్రకు చెందిన ప్రథమేష్.. పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో గోల్డ్ మెడల్ సాధించాడు. ఇందులో భాగంగా రాజమౌళి ప్రథమేష్ ను అభినందించాడు. 

ఈమేరకు తన ట్విట్టర్ ఖాతాలో.. "భారత్ లో ఆర్చరీ వృద్ధి చెందడం చూస్తుంటే ఆనందంగా ఉంది. ఈ రోజు ఎంతో ప్రతిభ వెలుగులోకి వచ్చింది. స్వర్ణ పథకం గెలిచినందుకు ప్రథమేష్ కు నా అభినందనలు" అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం రాజమౌళి చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.