రాజమౌళికి ప్రపంచ ఉత్తమ దర్శకుడిగా అవార్డు

రాజమౌళికి ప్రపంచ ఉత్తమ దర్శకుడిగా అవార్డు

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ప్రపంచ వ్యాప్తంగా హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానుల్ని సొంతం చేసుకుంది. అంతటి ఘనతను, కీర్తిని తెలుగు సినీ చిత్ర పరిశ్రమకు అందించిన రాజమౌళికి  ప్రపంచ చలన చిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే న్యూయార్క్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ సర్కిల్‌ అవార్డ్ దక్కింది. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు దర్శకత్వం వహించినందుకు ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి ఈ అవార్డ్ అందుకున్నాడు.

రాజమౌళి అవార్డ్ తీసుకున్న తర్వాత మాట్లాడుతూ ‘అవార్డ్ తీసుకున్నందుకు ఎంత ఆనందంగా ఉందో స్టేజ్ మీదనుంచి మీ అందరిని చూస్తుంటే అంతే కంగారుగా ఉంది. నేను సినిమాని ఒక గుడిలా భావిస్తా. చిన్నతనంలో సినిమా చూడటానికి వెళ్లినప్పుడు ఒకరకమైన ఆనందం కలుగుతుంది. అంతే ఆనందాన్ని నా సినిమా చూస్తున్నవాళ్లందరు పొందాలని అనుకుంటా. భారతదేశంలో సినిమాని ఎంత ఎంజాయ్ చేస్తారో, న్యూయార్క్, చైనా లాంటి దేశాల్లోని ప్రజలు కూడా అంతే ఎంజాయ్ చేశారు. సినిమాని ఇంతటి స్థాయికి తీసుకెళ్లిన ఎన్ టీఆర్, రామ్ చరణలకు దన్యవాదాలు’ అని జక్కన్న అన్నాడు. తాజాగా చైనా థియేటర్లలో రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ సినిమా రికార్డ్ సృష్టించింది. అక్కడ సినిమా రిలీజ్ అయిన 98 సెకన్లలోనే 932 టికెట్లు అమ్ముడు పోయాయి.