వేములవాడ, వెలుగు : శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని రాజన్నసిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్‌మహాజన్ పోలీసులను ఆదేశించారు. బుధవారం టౌన్ పోలీస్‌స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లో పెండింగ్ కేసుల పురోగతిపై సమీక్షించారు.
.స్టేషన్‌లో విధుల నిర్వహణపై సిబ్బందిని ఆరా తీశారు. టెంపుల్ టౌన్ వేములవాడలో విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఆయన వెంట ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, సీఐ వీరప్రసాద్, ఎస్ఐ అంజయ్య ఉన్నారు.
బోయినిపల్లి, వెలుగు,: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. బుధవారం బోయినిపల్లి మండలం వెంకట్రావుపల్లి వద్ద జంక్షన్‌ను పరిశీలించారు.
ఇక్కడ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు గల కారణాలు అడిగి తెలుసుకొని, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. ఎస్పీ వెంట సీఐ శ్రీనివాస్, ఎస్ఐ పృధ్వీధర్‌గౌడ్ తదితరులు ఉన్నారు.