మాకు మే 20నే సంక్రాంతి

మాకు మే 20నే సంక్రాంతి

గరుడవేగ, కల్కి వంటి సినిమాలతో సరికొత్త దారిలో సాగడం మొదలుపెట్టారు రాజశేఖర్. ఈసారి వాటికంటే కొత్త తరహా సబ్జెక్ట్‌‌ని సెలెక్ట్ చేసుకున్నారు. మూడేళ్ల క్రితం వచ్చిన మలయాళ మూవీ ‘జోసెఫ్‌‌’ రీమేక్‌‌లో నటిస్తున్నారు. ‘శేఖర్‌‌‌‌’ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జీవిత దర్శకత్వం వహిస్తున్నారు. బీరం సుధాకర్ రెడ్డి, బొగ్గరపు శ్రీనివాస్, శివాని, శివాత్మిక నిర్మిస్తున్నారు. మే 20న సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ఓ సాంగ్‌‌ని, టీజర్‌‌‌‌ని రిలీజ్ చేశారు. నిన్న అడివి శేష్ ట్రైలర్‌‌‌‌ని లాంచ్ చేశాడు. తర్వాత మాట్లాడుతూ ‘ప్రతి మగాడి విజయం వెనుక ఒక మహిళ ఉంటుందంటారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ప్రతి విషయంలో వాళ్లే ముందుంటున్నారు. జీవితగారే దీనికి ఉదాహరణ. రాజశేఖర్ గారి సినిమాలు చిన్నప్పట్నుంచీ చూస్తూ పెరిగాను. ఆయన నటించిన ‘మగాడు’ నా ఆల్‌‌టైమ్ ఫేవరేట్. ‘శేఖర్‌‌‌‌’ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అన్నాడు శేష్. రాజశేఖర్ మాట్లాడుతూ ‘సంక్రాంతికే రిలీజ్ చేసేయాలనుకున్నాం. వీలు కాలేదు. అప్పట్నుంచీ డేట్ దొరక్క ఇప్పుడు విడుదల చేస్తున్నాం. మాకు సంక్రాంతి మే 20నే వస్తుంది. మూవీ తప్పకుండా సక్సెస్ అవుతుందనే కాన్ఫిడెన్స్ ఉంది’ అన్నారు.  ‘మంచి సినిమా చూడటానికి  ప్రేక్షకులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఈ సినిమాకి వర్క్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్’ అని చెప్పారు జీవిత.  మా ఫ్యామిలీ అంతా కలిసి చేసిన ఈ సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉందంది శివాని. శివాత్మిక, ఈషా రెబ్బా, పవన్ సాధినేని, ప్రసన్న కుమార్, ముత్యాల రామదాసు, అనూప్ రూబెన్స్, రవివర్మ కూడా పాల్గొన్నారు.