
ఓఆర్ఆర్ వద్ద జరిగిన కారు ప్రమాదంలో తనకెలాంటి గాయాలు కాలేదన్నారు హీరో రాజశేఖర్. ప్రమాదం జరిగినప్పుడు కారులో తాను ఒక్కడినే ఉన్నానని చెప్పారు. రామోజీ ఫిలీం సిటీ నుంచి ఇంటికి వస్తుండగా అర్థరాత్రి ఔటర్ రింగ్ రోడ్డుపై గోల్కొండ అప్పా జంక్షన్ వద్ద కారు బోల్తాపడిందని చెప్పారు.అయితే ఎదురుగా వస్తున్న కారు వాళ్లు ఆగి దగ్గరకు వచ్చి తనను గుర్తుపట్టి బయటకు లాగారని చెప్పారు. వెంటనే పోలీసులకు,తన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చానని అన్నారు. తర్వాత వారి కారులో ఇంటికి వెళుతుండగా తన కుటుంబ సభ్యులు ఎదురుగా వచ్చి తీసుకెళ్లారని చెప్పారు రాజశేఖర్.