లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుందనే రాజాసింగ్ ముందస్తు అరెస్టు : గోషామహల్ ఏసీపీ సతీష్ కుమార్

లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుందనే రాజాసింగ్ ముందస్తు అరెస్టు : గోషామహల్ ఏసీపీ సతీష్ కుమార్

హనుమాన్ శోభాయాత్రకు ముందు బీజేపీ గోషామహల్ ఎమ్మల్యే  రాజాసింగ్ కు చుక్కెదురైంది. రాజాసింగ్ ను శోభాయాత్రలో పాల్గొనివ్వకుండా పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. గౌలిగూడ నుంచి శోభాయాత్రకు బయలుదేరుతున్న టైంలో పోలీసులు అరెస్ట్ చేశారు. గత శోభాయాత్రల్లో పాల్గొంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నాడనే కారణంతో రాజాసింగ్ ను ముందస్తు అరెస్టులు చేసినట్లు పోలీసులు చెప్తున్నారు. రాజాసింగ్ పై ముంబై సహా పలు చోట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడనే కారణంతో ఎఫ్‌ఐఆర్ లు నమోదు చేశారు. 

రాజాసింగ్  జైలు నుంచి రిలీజ్ చేసినప్పుడు కూడా హైకోర్టు పలు షరతులతో అమలు చేస్తూ బెయిల్ మంజూరు చేసింది. తాజాగా జరిగిన శ్రీరామ నవమి శోభాయాత్రలో కూడా రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడని, మరోసారి అలా జరగకుండా చూసుకోవాలని పోలీసులు హెచ్చరించారు.  

అరెస్టుపై స్పందించిన రాజాసింగ్ రాష్ట్ర ప్రభుత్వం హిందువులపై కక్ష సాధింపు చర్యలు చేస్తోందని, హిందువులను జైల్లో పెట్టడమే బీఆర్‌‌ఎస్ ప్లాన్ అని మండిపడ్డారు. తను ర్యాలీలో పాల్గొంటో వచ్చిన సమస్యేంటని ప్రభుత్వాన్ని, పోలీసులను ప్రశ్నించారు. 
తను శోభాయాత్రలో పాల్గొనడం వల్ల లా అండ్ ఆర్డర్ కు ఎప్పుడు సమస్య వచ్చిందో చెప్పాలని కోరారు. అయితే, రాజాసింగ్ అరెస్ట్‌పై మాట్లాడిన పోలీసులు శోభాయాత్రలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వల్ల లా అండ్ ఆర్డర్ దెబ్బతినే ప్రమాధం ఉండటంతో రాజాసింగ్ ను ముందస్తు అరెస్టులు చేసినట్లు తెలిపారు.