రాజాసింగ్​ రిమాండ్ తిరస్కరణపై హైకోర్టులో విచారణ

రాజాసింగ్​ రిమాండ్ తిరస్కరణపై హైకోర్టులో విచారణ

హైదరాబాద్, వెలుగు: గోషామహల్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే రాజాసింగ్​ రిమాండ్​ను లోయర్ కోర్టు తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్​పై హైకోర్టు శుక్రవారం విచారించింది. రాజాసింగ్‌‌‌‌‌‌‌‌కు 41ఏ నోటీసు ఇవ్వనందున ఆయనను రిమాండ్​కు పంపేందుకు లోయర్ కోర్టు ఇదివరకే నిరాకరించింది. అన్ని కేసుల్లో 41ఏ నోటీసు జారీ అవసరం లేదని పోలీసులు హైకోర్టులో అప్పీల్‌‌‌‌‌‌‌‌ దాఖలు చేశారు. దీనిపై చీఫ్‌‌‌‌‌‌‌‌ జస్టిస్‌‌‌‌‌‌‌‌ ఉజ్జల్‌‌‌‌‌‌‌‌ భూయాన్, జస్టిస్‌‌‌‌‌‌‌‌ సీవీ భాస్కర్‌‌‌‌‌‌‌‌రెడ్డిల డివిజన్‌‌‌‌‌‌‌‌ బెంచ్‌‌‌‌‌‌‌‌ విచారించింది.

లోయర్‌‌‌‌‌‌‌‌ కోర్టు ఉత్తర్వుల్లో హైకోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని రాజాసింగ్‌‌‌‌‌‌‌‌ తరఫు లాయర్‌‌‌‌‌‌‌‌ వాదించారు. దీనిపై ప్రభుత్వం తరఫున ఏజీ బీఎస్‌‌‌‌‌‌‌‌ ప్రసాద్‌‌‌‌‌‌‌‌ వాదిస్తూ.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులు 41ఏ నోటీసుపై సుప్రీంకోర్టుకు వెళ్లారని, ఆ ఉత్తర్వులు ఉత్తర్వులు వచ్చేదాకా రాజాసింగ్‌‌‌‌‌‌‌‌ కేసు విచారణ వాయిదా వేయాలని కోరారు. దీంతో హైకోర్టు ఈ నెత 25కి వాయిదా వేసింది.