నిరసనగా 12 గంటల పాటు పరుగెత్తిన ఎమ్మెల్యే

నిరసనగా 12 గంటల పాటు పరుగెత్తిన ఎమ్మెల్యే

రాజస్థాన్ లో నిరుద్యోగ యువతకు మద్దతుగా ఇండిపెండెంట్ ఎమ్మెల్యే బల్జీత్ యాదవ్ 12 గంటల పాటు రన్నింగ్ చేశారు. రాజస్థాన్ ఎలిజిబిలిటీ ఎగ్జామినేషన్ ఫర్ టీచర్ పేపర్ లీకేజీకి సంబంధించి ఎమ్మెల్యే బల్జీత్ నిరసన చేపట్టారు. రాజస్థాన్ లో ని సెంట్రల్ పార్కులో చేపట్టిన ఈ నిరసన కార్యక్రమానికి నిరుద్యోగ యువత భారీగా తరలివచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు యువతకు చేసిందేమీ లేదన్నారు బల్జీత్.. పేపర్ లీకేజీకి కారణమైన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.