పోలింగ్ తేదీలు మార్చండి : ఈసీకి బీజేపీ లేఖ

పోలింగ్ తేదీలు మార్చండి : ఈసీకి బీజేపీ లేఖ

పోలింగ్ తేదీ మార్పు కోసం ఎన్నికల కమిషన్‌కు లేఖ రాయబోతున్నట్లు భారతీయ జనతా పార్టీ తెలిపింది. రాజస్థాన్‌లోని మొత్తం 2వందల అసెంబ్లీ స్థానాలకు నవంబర్‌లో ఓటింగ్ జరుగనుందని ఎన్నికల సంఘం (EC) అక్టోబర్ 9న ప్రకటించింది. 23న ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న చేపట్టనున్నట్టు వెల్లడించింది.

ఇప్పటికే రాష్ట్రంలో తిరిగి పుంజుకోవాలని చూస్తున్న కాషాయ దళం.. నవంబర్ 23 దేవ్ ఉథాని ఏకాదశి అని వాదించారు. ఈ శుభ సందర్బం రోజే ఎన్నికలు జరగనున్న తరుణంలో రాష్ట్రంలో దాదాపు 45 వేలకు పైగా వివాహాలు జరిగే అవకాశం ఉందని, దీంతో ఓటింగ్ శాతం దెబ్బతినే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు ఆరోపించాయి. వివాహ వేదికలు ఇప్పటికే బుక్ అయ్యాయి. నవంబర్ 23న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వివాహ వేడుకలు నిర్వహించనున్నారు. 

రాష్ట్రవ్యాప్తంగా 51వేల 756 పోలింగ్ బూత్‌లు ఉన్నాయని ఎన్నికల ప్రధాన అధికారి సోమవారం ప్రకటించారు. ప్రజలు ఓటు వేసేలా ప్రోత్సహించేందుకు తక్కువ సంఖ్యలో ఉన్న ఓటర్ల కోసం కొన్ని కొత్త బూత్‌లను ఏర్పాటు చేశారు. తుది ఓటరు జాబితా ప్రకారం.. ఈ ఎన్నికల్లో 2.75 కోట్ల మంది పురుషులు, 2.51 కోట్ల మంది మహిళా ఓటర్లు సహా 5.27 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అర్హులుగా ఉన్నారు. 18 నుంచి 19 ఏళ్ల మధ్య వయసున్న 22 లక్షల మంది ఓటర్లు తొలిసారిగా ఓటు వేయనున్నారు.