దేశంలో కాంగ్రెస్కు ఆదరణ తగ్గలేదు

దేశంలో కాంగ్రెస్కు ఆదరణ తగ్గలేదు

జైపూర్: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నట్లు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తెలిపారు. అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసేందుకు త్వరలో  డేట్ ఫిక్స్ చేసి చెప్తానన్నారు. ఒకవేళ తాను కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపడితే చేయాల్సిన కార్యచరణను అధినేత్రి సోనియాగాంధీ, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అజయ్ మెకాన్ డిసైడ్ చేస్తారన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టాలని రాహుల్ ని చాలాసార్లు కోరానని, కానీ గాంధీ ఫ్యామిలీ నుంచి ఎవరూ కూడా అధ్యక్ష పదవిని చేపట్టబోరని ఆయన చెప్పారని గెహ్లాట్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే తాను అధ్యక్ష పదవికి పోటీ చేయాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఒకవేళ తాను అధ్యక్షుడిగా గెలిస్తే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సూచనల మేరకు పని చేస్తానని స్పష్టం చేశారు. 

అధ్యక్షుడిగా ఎవరూ గెలిచినా... అందరం కలిసి పని చేస్తామని  చెప్పారు. దేశంలో కాంగ్రెస్ కు ఆదరణ తగ్గలేదని, బూత్ నుంచి జాతీయ స్థాయి వరకు పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. కలిసికట్టుగా ఉండి బీజేపీని ఓడించాలంటే  ప్రతిపక్షాలు ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.