రాజస్థాన్ ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ఇప్పుడు అధికారంలోఉన్న బీజేపీ ప్రభుత్వం నిలిపివేసింది. గత ప్రభుత్వం కల్పించిన గృహాలకు ఉచిత విద్యుత్ పథకాన్ని రద్దు చేసింది. అయితే ఇప్పటి వరకు ఉన్న లబ్ధిదారులను కొనసాగిస్తామని భజన్ లాల్ శర్మ ప్రభుత్వం( బీజేపీ) తెలిపింది. కొత్తగా ఈ పథకం కింద దరఖాస్తులను స్వీకరించమని తెలిపింది, గత ప్రభుత్వం గృహాలకు నెలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందేందుకు అవకాశం కల్పించింది . అలాగే అశోక్ గెహ్లాట్ హయాంలో ప్రవేశ పెట్టిన ఉచిత స్మార్ట్ ఫోన్ పథకాన్ని కూడా రద్దు చేసింది . రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేసింది. 2023 జూన్ నుంచి మార్చి 2024 వరకు ఉచిత విద్యుత్ పథకానికి 98.23 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని ప్రభుత్వం తెలిపింది .జనధార్‌తో లింక్ అయన డొమెస్టిక్ కనెక్షన్ మాత్రమే ఈ పథకం ప్రయోజనాలు వర్తిస్తాయని ఇంధన మంత్రి పేర్కొన్నారు. ఈ నమోదు ప్రక్రియను పూర్తి చేయని దేశీయ వినియోగదారులు అనర్హులుగా పరిగణించబడతారని మంత్రి తెలిపారు. ఇకపై కొత్తగా ఎవరి దరఖాస్తును స్వీకరించమన్నారు.
రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాల్లో స్మార్ట్‌ఫోన్‌ల పంపిణీకి సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్యే వికాస్ చౌదరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా, జనవరి 2024 నాటికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డిబిటి) విధానం ద్వారా 24 లక్షల 56 వేల 001 మంది మహిళలు ఉచిత స్మార్ట్‌ఫోన్‌లను అందుకున్నారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఫోన్ల పంపిణీని అక్టోబర్ 9, 2023న నిలిపివేశారు. ఆ తరువాత కొత్తగా అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఈ పథకం గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాని ఇప్పుడు స్మార్ట్ ఫోన్ల పంపిణి పథకాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో స్మార్ట్‌ఫోన్ పంపిణీ పథకం కోసం కేటాయించిన మొత్తం బడ్జెట్ రూ. 1,811.30 కోట్లు. ఈ మొత్తంలో, రూ.1,745.22 కోట్లు ఖర్చు చేశారు, ఇందులో రూ.1,670.08 కోట్లు నేరుగా లబ్ధిదారులకు బదిలీ చేయబడ్డాయి. రెండు నెలల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా 490కి పైగా శిబిరాలను ఏర్పాటు చేసి, మొత్తం రూ.75.14 కోట్లు ఖర్చు చేశారు.
