అబార్షన్​కు అనుమతివ్వలేం

అబార్షన్​కు అనుమతివ్వలేం
  •      తేల్చి చెప్పిన రాజస్థాన్ హైకోర్టు 

జైపూర్: అబార్షన్​కు అనుమతివ్వాలంటూ 11 ఏండ్ల బాలిక వేసిన పిటిషన్​ను రాజస్థాన్ హైకోర్టు కొట్టేసింది. తనపై అత్యాచారం జరిగిందని, అందుకే ప్రెగ్నెన్సీ వచ్చిందని పిటిషన్​లో బాధితురాలు పేర్కొంది. తాను ఎదుర్కొన్న వేధింపులు ప్రెగ్నెన్సీని చూస్తుంటే గుర్తుకు వస్తున్నాయంటూ చెప్పింది. ఈ పిటిషన్​ను జస్టిస్ అనూప్ కుమార్ ధండ్ విచారించారు. 31 వారాలు గడిచాయని, పూర్తిగా అభివృద్ధి చెందిన పిండానికి జీవించే హక్కు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

 మెడికల్ బోర్డు రిపోర్ట్ ప్రకారం.. పిండం పెరుగుతున్నదని, ముఖ్యమైన అవయావాలన్నీ అభివృద్ధి చెందాయని తెలిపారు. డెలివరీకి కూడా టైమ్ అయిందని, ఇప్పుడు అబార్షన్​కు అనుమతించలేమని స్పష్టం చేశారు. పంజాబ్, హర్యానా హైకోర్టులు కూడా ఇలాంటి కేసుల్లోనే అబార్షన్​కు తిరస్కరించాయని గుర్తు చేశారు. బాధితురాలిపై తండ్రి అత్యాచారం చేయగా.. మామ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.