రెండు కాళ్లు లేకున్నా..12వ సారి అమర్​నాథ్​ యాత్ర

రెండు కాళ్లు లేకున్నా..12వ సారి అమర్​నాథ్​ యాత్ర
  •  
  • రాజస్థాన్​కు చెందిన శివభక్తుడి సాహసం

బాల్టాల్: దక్షిణ కాశ్మీర్​లోని అమర్​నాథ్​గుహకు చేరుకోవాలంటే అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నవారికే ఎంతో కష్టం. కానీ ఓ వ్యక్తి రెండు కాళ్లు లేకున్నా 12వ సారి ఈ పవిత్ర యాత్రకు బయలు దేరాడు. శివుడి కృపతో ఏటా ఈ యాత్ర పూర్తిచేస్తున్నట్టు చెప్తున్నా డు. రాజస్థాన్‌‌‌‌లోని జైపూర్‌‌‌‌కు చెందిన ఆనంద్ సింగ్ 2002లో ఒక ప్రమాదంలో తన రెండు కాళ్లను కోల్పోయాడు. అయినా..శివ భక్తుడైన సింగ్.. మొక్కవోని దీక్షతో ఏటా అమర్​నాథ్​ యాత్ర  చేపడుతున్నాడు. 

3,880 మీటర్ల ఎత్తులోని గుహకు చేరుకొని శివలింగాన్ని దర్శించుకుంటు న్నాడు. 2010లో తాను ఈ యాత్ర చేపట్టానని, 2013లో కేదార్​నాథ్​లో వరదల వల్ల ఒకసారి, 2019లో కొవిడ్​ వల్ల రెండు సార్లు మాత్రమే అమర్​నాథ్‌కు రాలేకపోయానని తెలిపాడు. మొదట నాలుగుసార్లు ట్రక్​టైర్​ కటౌట్​లో కూర్చొని చేతులతో డ్రాగ్​ చేసుకుంటూ వెళ్లానని, ఇప్పుడు మాత్రం పల్లకిలో వెళ్తున్నట్టు చెప్పాడు. తన ప్రయత్నా న్ని కొందరు విమర్శిస్తున్నారని, అయినా పట్టించుకోనన్నాడు.