రాయల్స్‌‌‌‌‌‌‌‌ హ్యాట్రిక్‌‌‌‌‌‌‌‌..రాజస్తాన్‌‌‌‌‌‌‌‌కు వరుసగా మూడో విక్టరీ

రాయల్స్‌‌‌‌‌‌‌‌ హ్యాట్రిక్‌‌‌‌‌‌‌‌..రాజస్తాన్‌‌‌‌‌‌‌‌కు వరుసగా మూడో విక్టరీ
  •    మెరిసిన బౌల్ట్‌‌‌‌‌‌‌‌, చహల్, పరాగ్
  •     మళ్లీ ఓడిన ముంబై

ముంబై : ఐపీఎల్‌‌‌‌‌‌‌‌17వ సీజన్‌‌‌‌‌‌‌‌లో రాజస్తాన్ రాయల్స్‌‌‌‌‌‌‌‌ దూసుకెళ్తుండగా..  ముంబై ఇండియన్స్‌‌‌‌‌‌‌‌ నిరాశ పరుస్తోంది. రాయల్స్‌‌‌‌‌‌‌‌ వరుసగా మూడో విక్టరీతో హ్యాట్రిక్ కొడితే.. ముంబై పరాజయాల్లో హ్యాట్రిక్ సాధించింది. యుజ్వేంద్ర చహల్ (3/11),  ట్రెంట్‌‌‌‌‌‌‌‌ బౌల్ట్‌‌‌‌‌‌‌‌ (3/22)  సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌కు తోడు రియాన్ పరాగ్ (39 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 54 నాటౌట్‌‌‌‌‌‌‌‌) మరో ఫిఫ్టీతో మెరవడంతో  సోమవారం

వాంఖడేలో జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో రాజస్తాన్ 6  వికెట్ల తేడాతో  ముంబైని ఓడించింది. తొలుత ముంబై 20 ఓవర్లలో 125/9 స్కోరు మాత్రమే చేసింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (21 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 6 ఫోర్లతో 34), తిలక్ వర్మ (39 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 2 సిక్సర్లతో 32) మాత్రమే రాణించారు.  ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో రాయల్స్‌‌‌‌‌‌‌‌ 15.3 ఓవర్లోనే 127/4 స్కోరు చేసి గెలిచింది. బౌల్ట్‌‌‌‌కు ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

ఇటు బౌల్ట్‌‌‌‌‌‌‌‌...అటు చహల్

టాస్ ఓడిన ముంబై ఇండియన్స్‌‌‌‌‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ చప్పగా సాగింది. పేసర్  ట్రెంట్‌‌‌‌‌‌‌‌ బౌల్డ్‌‌‌‌‌‌‌‌ టాపార్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దెబ్బకొట్టాడు. నాలుగు బాల్స్‌‌లో  రోహిత్ శర్మ (0) , నమన్ ధీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (0),   డెవాల్ట్‌‌‌‌‌‌‌‌ బ్రేవిస్‌‌‌‌‌‌‌‌ (0) ముగ్గురినీ గోల్డెన్ డకౌట్‌‌‌‌‌‌‌‌ చేసి ఔరా అనిపిస్తే.. స్పిన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చహల్ మిడిలార్డర్ పని పట్టి ముంబైని  కట్టడి చేశాడు. తొలి ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచే ముంబై ఇబ్బంది పడింది. బౌల్ట్‌‌‌‌‌‌‌‌ వేసిన ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ ఐదో బాల్‌‌‌‌‌‌‌‌కే రోహిత్‌‌‌‌‌‌‌‌ కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు క్యాచ్‌‌‌‌‌‌‌‌ ఇవ్వడంతో స్టేడియం సైలెంట్‌‌‌‌‌‌‌‌ అయింది. తర్వాతి బాల్‌‌‌‌‌‌‌‌కే నమన్‌‌‌‌‌‌‌‌ ధీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎల్బీ అయ్యాడు. బర్గర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేసిన రెండో ఓవర్లో ఇషాన్ (16) 6, 4తో అలరించాడు.

కానీ, ఇంపాక్ట్ ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వచ్చిన బ్రేవిస్‌‌‌‌‌‌‌‌  బౌల్ట్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో నిర్లక్ష్యమైన షాట్‌‌‌‌‌‌‌‌తో బర్గర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు క్యాచ్ ఇచ్చాడు. తర్వాతి ఓవర్లో మరో ఫోర్ కొట్టిన ఇషాన్‌‌‌‌‌‌‌‌ను బర్గర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఔట్‌‌‌‌‌‌‌‌ చేయడంతో  ముంబై 20/4తో నిలిచింది. ఈ టైమ్‌‌‌‌‌‌‌‌లో తిలక్‌‌‌‌‌‌‌‌, పాండ్యా ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. బౌల్ట్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో సిక్స్‌‌‌‌‌‌‌‌తో తిలక్‌‌‌‌‌‌‌‌ టచ్‌‌‌‌‌‌‌‌లోకి రాగా.. బర్గర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేసిన ఆరో ఓవర్లో హార్దిక్ మూడు ఫోర్లతో అలరించాడు. అవేశ్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో తిలక్‌‌‌‌‌‌‌‌ సిక్స్‌‌‌‌‌‌‌‌, హార్దిక్ ఫోర్ రాబట్టడంతో ముంబై పుంజుకున్నట్టు అనిపించింది. కానీ, స్పిన్నర్ చహల్ రాకతో  రాయల్స్‌‌‌‌‌‌‌‌ మళ్లీ జోరు పెంచింది.

ఫ్లాట్‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌తో పాండ్యాను బోల్తా కొట్టించిన చహల్‌‌‌‌‌‌‌‌ ఐదో వికెట్‌‌‌‌‌‌‌‌కు 56 రన్స్‌‌‌‌‌‌‌‌ పార్ట్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ను బ్రేక్ చేశాడు. ఆ వెంటనే అవేశ్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో హెట్‌‌‌‌‌‌‌‌మయర్ పట్టిన స్టన్నింగ్‌‌‌‌‌‌‌‌ క్యాచ్‌‌‌‌‌‌‌‌కు పీయూష్‌‌‌‌‌‌‌‌ చావ్లా (3) వెనుదిరగ్గా.. తన తర్వాతి ఓవర్లలో తిలక్‌‌‌‌‌‌‌‌, గెరాల్డ్ కొయెట్జీ (4)ని కూడా చహల్ పెవిలియన్‌‌‌‌‌‌‌‌ చేర్చాడు. మరో ఎండ్‌‌‌‌‌‌‌‌లో అశ్విన్ సైతం పొదుపుగా బౌలింగ్‌‌‌‌‌‌‌‌ చేయడంతో ముంబై ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ మెరుపుల్లేకుండా సాగింది. హిట్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టిమ్ డేవిడ్ (24 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 17)  సైతం ఇబ్బంది పడ్డాడు.  చివరి 11 ఓవర్లలో రెండే ఫోర్లు  రాబట్టిన ముంబై అతి కష్టంగా 120 మార్కు దాటింది. 

రియాన్‌‌‌‌‌‌‌‌ జోరు

చిన్న టార్గెట్ ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో రాజస్తాన్‌‌‌‌‌‌‌‌ తొలుత తడబడినా రియాన్ పరాగ్ జోరుతో ఈజీగా గెలిచింది.  మఫాకా వేసిన తొలి ఓవర్లో వరుసగా రెండు ఫోర్లతో ఊపు మీద కనిపించిన ఓపెనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యశస్వి జైస్వాల్‌‌‌‌‌‌‌‌ (10) మరో షాట్‌‌‌‌‌‌‌‌కు ట్రై చేసి ఆరో బాల్‌‌‌‌‌‌‌‌కే ఔటయ్యాడు. వన్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌లో వచ్చిన కెప్టెన్‌‌‌‌‌‌‌‌ సంజు శాంసన్‌‌‌‌‌‌‌‌ (12) ఐదో ఓవర్లో ఆకాశ్‌‌‌‌‌‌‌‌ మధ్వాల్ బాల్‌‌‌‌‌‌‌‌ను వికెట్ల మీదకు ఆడుకున్నాడు. క్రీజులో ఇబ్బంది పడిన జోస్ బట్లర్ (13)ను మధ్వాల్‌‌‌‌‌‌‌‌ బౌన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఔట్ చేయడంతో రాయల్స్‌‌‌‌‌‌‌‌ 48/3తో డిఫెన్స్‌‌‌‌‌‌‌‌లో పడగా... ముంబై రేసులోకి వచ్చింది.

ఈ సమయంలో గత మ్యాచ్‌‌‌‌‌‌‌‌ హీరో రియాన్ పరాగ్‌‌‌‌‌‌‌‌ జట్టును గెలిపించే బాధ్యత తీసుకున్నాడు. గత మ్యాచ్‌‌‌‌‌‌‌‌కు భిన్నంగా కాస్త జాగ్రత్తగా ఆడుతూ టార్గెట్‌‌‌‌‌‌‌‌ను కరిగించాడు. ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్ అశ్విన్‌‌‌‌‌‌‌‌ (16)తో నాలుగో వికెట్‌‌‌‌‌‌‌‌కు  40 రన్స్ జోడించి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ను చక్కదిద్దాడు. 13వ ఓవర్లో అశ్విన్‌‌‌‌‌‌‌‌ ఔటైన తర్వాత రియాగ్ ఒక్కసారిగా జోరు పెంచాడు. బుమ్రా బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో ఫోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, చావ్లా ఓవర్లో సిక్స్‌‌‌‌‌‌‌‌ కొట్టిన అతను కొయెట్జీ వేసిన 16వ ఓవర్లో వరుసగా 6,6,4తో ఫిఫ్టీ పూర్తి చేసుకోవడంతో పాటు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ను ముగించాడు. 

పాండ్యాకు మళ్లీ 

గుజరాత్‌‌‌‌‌‌‌‌ టైటాన్స్‌‌‌‌‌‌‌‌ను వీడి ముంబై ఇండియన్స్‌‌‌‌‌‌‌‌ కెప్టెన్సీ చేపట్టిన హార్దిక్ పాండ్యాను ఓ వర్గం ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌ ఆటాడుకుంటున్నారు. అతను ఎక్కడికి వెళ్లినా హేళన చేస్తున్నారు. హోమ్‌‌‌‌‌‌‌‌గ్రౌండ్‌‌‌‌‌‌‌‌ వాంఖడేలోనూ అతనికి ఇబ్బంది తప్పలేదు. మ్యాచ్‌‌‌‌‌‌‌‌ మొదలయ్యే ముందు గ్రౌండ్‌‌‌‌‌‌‌‌లో వామప్స్‌‌‌‌‌‌‌‌ చేస్తున్న టైమ్‌‌‌‌‌‌‌‌లో కొందరు ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌ అతడిని ఎగతాళి చేశారు. టాస్‌‌‌‌‌‌‌‌ టైమ్‌‌‌‌‌‌‌‌లో పాండ్యా పేరు పిలిచినప్పుడూ ఇదే పరిస్థితి ఎదురైంది. ఆ టైమ్‌‌‌‌‌‌‌‌లో ప్రేక్షకులు రోహిత్‌‌‌‌‌‌‌‌.. రోహిత్‌‌‌‌‌‌‌‌ అంటూ గట్టిగా అరిచారు. దాంతో, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ కల్పించుకొని కాస్త హుందాగా వ్యవహరించాలని కోరాల్సి వచ్చింది.

సంక్షిప్త స్కోర్లు

ముంబై     : 20 ఓవర్లలో 125/9 (పాండ్యా 34, తిలక్ 32, చహల్ 3/11, బౌల్ట్‌‌‌‌‌‌‌‌ 3/22).
రాజస్తాన్‌‌‌‌‌‌‌‌  : 15.3 ఓవర్లలో 127/4 (పరాగ్ 54*, మధ్వాల్ 3/20)