RR Jersey 2026: రాజస్థాన్ రాయల్స్ కొత్త జెర్సీపై ట్రోల్స్.. RCBని కాపీ కొట్టారంటూ మీమ్స్

RR Jersey 2026: రాజస్థాన్ రాయల్స్ కొత్త జెర్సీపై ట్రోల్స్.. RCBని కాపీ కొట్టారంటూ మీమ్స్

RR Jersey 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్ జట్టు తమ కొత్త జెర్సీని ఆవిష్కరించింది. ఈరోజు (మార్చి 18న) సోషల్ మీడియాలో విడుదల చేసిన ఈ కొత్త కిట్ క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఈ జెర్సీ డిజైన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జెర్సీలాగే ఉందని పలువురు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్, RCB జెర్సీల డిజైన్‌ సేమ్ ఉన్నాయనే చర్చ నెట్టింట జోరుగా సాగుతుంది. దీంతో అభిమానులు మీమ్స్‌తో RR జట్టును ట్రోల్ చేస్తున్నారు. కొందరు సరదాగా “RCB నుంచి కాపీరైట్ స్ట్రైక్ వస్తుందేమో” అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంకొందరు ఈ జెర్సీ 2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్ జెర్సీని పోలి ఉందని గుర్తు చేస్తున్నారు. 

ఇతర జట్లు కూడా జెర్సీలు విడుదల: 
ఇప్పటికే ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, డిఫెండింగ్ చాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ జెర్సీలను విడుదల చేశాయి. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ జెర్సీ 2020 సీజన్ కిట్‌ను గుర్తు చేసేలా ఉండగా, KKR జెర్సీ విడుదల వీడియోపై కూడా విమర్శలు వచ్చాయి.

ఐపీఎల్ 2026 కోసం రాజస్థాన్ సిద్ధం: 
ఇక రాజస్థాన్ రాయల్స్ జట్టు ఐపీఎల్ 2026 కోసం సిద్ధమవుతోంది. ఈ సీజన్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ నుంచి రవీంద్ర జడేజా, సామ్ కరన్ ని ట్రేడ్ చేసుకుని, తమ కెప్టెన్ సంజు శాంసన్ ని వదిలించుకుంది. అలాగే వేలంలో రవీ బిష్ణోయ్, ఆడమ్ మిల్న్ లాంటి ఆటగాళ్లను దక్కించుకుంది. జట్టులో ఇప్పటికే యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్ (కెప్టెన్), షిమ్రోన్ హెట్‌మైర్, వైభవ్ సూర్యవంశీ వంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు.