సెంచరీతో చెలరేగిన రహానే..ఢిల్లీ టార్గెట్-192

సెంచరీతో చెలరేగిన రహానే..ఢిల్లీ టార్గెట్-192

జైపూర్ : ఈ IPL సీజన్ లో మరో సెంచరీ నమోదైంది. ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్ లో రాజస్థాన్ బిగ్ స్కోర్ చేసింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 రన్స్ చేసింది. ప్రారంభంలోనే రాజస్ధాన్ కీలకమైన ప్లేయర్ సంజు శాంసన్ రన్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన స్టీవెన్ స్మిత్ తో కలిసి జోరు పెంచాడు రహానే. వీరిద్దరి పార్టనర్ షిప్ 100 దాటింది. ఈ క్రమంలోనే రహానే (105) సెంచరీతో రాణించగా స్మిత్ (50) హాఫ్ సెంచరీ చేశాడు. మ్యాచ్ ప్రారంభం నుంచి ఆచితూచ ఆడిన రహానే అవసరమైనప్పుడు సిక్సులు, బౌండరీలతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 3 సిక్సులు, 11 ఫోర్లతో 105 రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు. ఢిల్లీకి బిగ్ టార్గెట్ ను ముందుంచాడు.

రాజస్థాన్ ప్లేయర్లలో..రహానే(105), సంజు శాంసన్(0), స్టీవెన్ స్మిత్(50), బెన్ స్టోక్(8), స్టువర్ట్ బిన్నీ(19) టర్నర్(0), పరాగ్(4) రన్స్ చేశారు.

ఢిల్లీ బౌలర్లలో..ఇశాంత్ షర్మ(1), మొర్రీస్(1), అక్షర్ పటేల్(1), రబడా(2) వికెట్లు తీశారు.