CSK vs RR: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్.. మార్పులు లేకుండానే చెన్నై

CSK vs RR: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్.. మార్పులు లేకుండానే చెన్నై

ఐపీఎల్ 2025లో మంగళవారం (మే 20) చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ లో రాజస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ సీజన్ లో రాజస్థాన్ కు ఇదే చివరి మ్యాచ్ కావడం విశేషం. ఇప్పటివరకు 13 మ్యాచ్ లు ఆడిన రాజస్థాన్ 3 విజయాలతో పాయింట్ల పట్టికలో 9 వ స్థానంలో ఉంది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన 12 మ్యాచ్ ల్లో 3 విజేతలతో పదో స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ ఒక మార్పుతో బరిలోకి దిగుతుంది.   యుధ్వీర్ సింగ్ చరక్ ప్లేయింగ్ 11 లోకి వచ్చాడు. మరోవైపు చెన్నై ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంది.   

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI):

ఆయుష్ మ్హత్రే, డెవాన్ కాన్వే, ఉర్విల్ పటేల్, రవీంద్ర జడేజా, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, ఎంఎస్ ధోని(కెప్టెన్, వికెట్ కీపర్), అన్షుల్ కాంబోజ్, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI):

యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్(కెప్టెన్, వికెట్ కీపర్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, వనిందు హసరంగా, క్వేనా మఫాకా, యుధ్వీర్ సింగ్ చరక్, తుషార్ దేశ్‌పాండే, ఆకాష్ మధ్వల్ 

ALSO READ | IPL 2025: పంజాబ్, గుజరాత్‌కు బంపర్ ఛాన్స్.. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ వేదికలు ఇవే!