ఇంట్లోకి ఎంటరైన చిరుత పులి.. తాడుతో కట్టేసి ఓ ఆట ఆడుకుంది.. మహిళ ధైర్యానికి సలాం అంటున్న నెటిజన్లు !

ఇంట్లోకి ఎంటరైన చిరుత పులి.. తాడుతో కట్టేసి ఓ ఆట ఆడుకుంది.. మహిళ ధైర్యానికి సలాం అంటున్న నెటిజన్లు !

చిరుత పులి సడెన్ గా ఇంట్లోకి ఎంటరైతే ఏం చేస్తాం.. కెవ్వున కేక వేసి దాక్కోవాలని చూస్తాం. లేదంటే సహాయం కోసం అరుస్తం. ఆ గ్యాప్ లోనే అది దాడి చేయొచ్చుకూడా. కానీ ఇక్కడ ఒక మహిళ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వెరీ బ్రేవ్ వుమన్ అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. 

రాజస్థాన్ లో జరిగిన ఈ ఇన్సిడెంట్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిరుత ఇంట్లోకి ఎలా ఎంటరైందో కానీ.. ఆమె మాత్రం చాలా ధైర్యంగా తెలివిగా దాన్ని తాడుతో కట్టేసింది. ఆ తర్వాత ఫారెస్ట్ ఆఫీసర్స్ కు ఫోన్ చేసి ఆ లీపార్డ్ ను పట్టించడం సంచలనంగా మారింది. చిరుత పులిని డోర్ కు కట్టేసింది మహిళ. ఆమెకుగానీ ఫ్యామిలీ మెంబర్స్ కు గానీ ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉండొచ్చు. అయినా ఆమె ఎలా మేనేజ్ చేసిందని షాకింగ్ కు గురవుతున్నారు.

ఉదయ్ పూర్ లో ఇంట్లోకి వచ్చిన చిరుతను తాడుతో కట్టేసింది మహిళ. తప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నం చేసింది చిరుత. అది ముందుకు వెళ్తుంటే ఆమె ధైర్యంగా తాడుతో లాగడం చూసి ఎంత ధైర్యం ఈమెకు.. అని ఆశ్చర్యపోతున్నారు. ఫారెస్ట్ ఆఫీసర్స్ కు ఫోన్ చేయడంతో మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే వదిలి పెట్టి ఉంటే భయంతో స్థానికులు దాని ప్రాణాలు తీసేవారు. ఒకరకంగా ఆమె వాళ్ల కుటుంబాన్ని కాపాడుకుంటూనే ఆ చిరుత ప్రాణం కాపాడిందని కొనియాడుతున్నారు.

మరి కొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. చిరుతనే ఇలా కట్టేసిందంటే.. ఇక ఆ ఇంట్లో భర్త పరిస్థితేంటని చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఒక మహిళను ఎప్పుడు తక్కువ అంచనా వేయవద్దని కొందరు పోస్టు చేస్తున్నారు.