
జైపూర్: రాజస్థాన్ ‘యోగి ఆదిత్యనాథ్’గా పేరు పొందిన బాబా బాలక్ నాథ్ (39) కూడా అనూహ్యంగా సీఎం రేసులో లైమ్ లైట్ లోకి వచ్చారు. ఆల్వార్ నుంచి ఎంపీగా ఉన్న ఆయన ప్రస్తుత ఎన్నికల్లో తిజర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి లీడ్ లో ఉన్నారు. నాథ్ సంప్రదాయానికి చెందిన రోహ్తక్ మఠానికి ఈయన చీఫ్ మహంత్‌గా ఉన్నారు.
కేవలం పాఠశాల విద్యను మాత్రమే పూర్తి చేసుకున్నా.. ఈయన తన మఠం ఆధ్వర్యంలో యూనివర్సిటీ, హాస్పిటల్, మెడికల్ కాలేజీ, స్కూళ్లు నడుపుతున్నారు. హిందూత్వ ఎజెండా, బోల్డ్ ఇమేజ్‌తో ఓబీసీ వర్గానికి చెందిన ఈయనకు జనంలో మంచి పాపులారిటీ ఉంది.