
ప్రముఖ ధియేటర్ డైరెక్టర్ రజత్ కపూర్ షో హైదరాబాద్ లో ప్రదర్శితం అవుతున్నాయి. శనివారం (ఆగస్టు 09) సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ శిల్పాకళా వేదికలో ప్రదర్శిస్తున్నారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న వాట్స్ డన్ ఈజ్ డన్.. నాటకం ప్రదర్శనకు అంతా సిద్ధమైంది.
షేక్స్ పియర్ ఫేమస్ నవల మాక్ బెత్ ఆధారంగా ఈ నాటకాన్ని రజత్ కపూర్ డెరెక్షన్ చేస్తున్నారు. ఈ స్టేజ్ షోలో రణ్ వీర్ శౌరీ, వినయ్ పాఠక్ లు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మరోవైపు శనివారం రోజే శిల్పాకళా వేదికలో మరో నాటకం కరంజల్ బ్రదర్స్ ప్రదర్శన కూడా ఉంది. ఇందులోనూ వినయ్ పాఠక్ నటిస్తున్నారు. మరో నటుడు సౌరవ్ నయ్యర్ కూడా యాక్ట్ చేస్తున్నారు. దీనికి కూడా రజత్ కపూరే డైరెక్టర్.
ఈ రెండు షోలు ఇప్పటకే చాలా సిటీల్లో ప్రదర్శితమయ్యాయి. ఎంతో మంది అభిమానాన్ని చూరగొన్న ఈ నాటకాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ఈ రెండు షోలకు సంబంధించి టికెట్స్ బుక్ మై షో (Bookmyshow)లో అందుబాటులో ఉన్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. రేపు (శనివారం ఆగస్టు 09) రక్షా బంధన్ సందర్భంగా ప్లే అవ్వనున్న ఈ నాటకాలకు ప్రేక్షకుల నుంచి ఫుల్ సపోర్ట్ వస్తోందని.. హైదరాబాద్ లో ప్లే అవుతున్న ఈ షో ను చూసి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు.
►ALSO READ | ఆర్థిక అవగాహన పెంచేందుకు "సమీక్ష" సిరీస్.. పిరమిల్ ఫైనాన్స్ కొత్త ప్రయోగం..!