
భోపాల్: ఆర్సీబీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ రజత్ పటిదార్‌కు ప్రమోషన్ లభించింది. మధ్యప్రదేశ్ జట్టుకు అన్ని ఫార్మాట్ల కెప్టెన్‌గా పటిదార్ ఎంపికయ్యాడు. శుభం శర్మ స్థానంలో మధ్యప్రదేశ్ జట్టుకు అన్ని ఫార్మాట్ల నాయకుడిగా పటిదార్ పగ్గాలు చేపట్టనున్నాడు.
కాగా, రజత్ పాటిదార్ నేతృత్వంలోని ఆర్సీబీ జట్టు ఐపీఎల్ 2025విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. తద్వారా ఐపీఎల్ టైటిల్ కోసం ఆర్సీబీ 18 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. కెప్టెన్, బ్యాటర్‌గా ఆర్సీబీ తొలి ఐపీఎల్ టైటిల్ గెలవడంలో పటిదార్ కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉండగానే.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన పటిదార్ ఇక్కడ అదరగొట్టాడు.
సెంట్రల్ జోన్ పదేళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఆ జట్టుకు దులీఫ్ ట్రోఫీ అందించాడు. దులీప్ ట్రోఫీలో తన కెప్టెన్సీతో పాటు బ్యాటర్ గానూ అదరగొట్టాడు పటిదార్. సౌత్ జోన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించి జట్టు విజయానికి మార్గం సుగమం చేశాడు.
అలాగే.. వెస్ట్ జోన్‌తో జరిగిన సెమీఫైనల్లో 77 పరుగులు, నార్త్ జోన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో 125, 66 పరుగులు చేసి సెంట్రల్ జోన్‌ను దులీప్ ట్రోఫీ 2025 విజేతగా నిలిపాడు పటిదార్. ఈ క్రమంలోనే కెప్టెన్సీలో పరిణితి సాధించి.. బ్యాటర్ గానూ అద్భుతంగా రాణిస్తున్న పటిదార్‌కు అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది మధ్యప్రదేశ్ టీమ్.