వృషభరాశిలో బుధ సంచారం.. మూడు రాశుల వారికి రాజయోగం.. మిగతా వారికి ఎలా ఉంటుందంటే...

 వృషభరాశిలో బుధ సంచారం.. మూడు రాశుల వారికి రాజయోగం.. మిగతా వారికి ఎలా ఉంటుందంటే...

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు ఎప్పటికప్పుడు తమ రాశుల స్థానాలను మారుస్తూ ఉంటాయి. దీని వల్ల ఆ రాశుల వ్యక్తుల జీవితాల్లో శుభ, అశుభ పరిణామాలు జరగనున్నాయి. మొత్తం తొమ్మిది గ్రహాలతో పాటు, బుధుడు కూడా ఈ రాశుల వారికి అద్భుతమైన జ్ఞానాన్ని ప్రసాదించనున్నాడు. దీనివల్ల ప్రతీ ఒక్కరి జీవితంలో అదృష్టం ఎదురుకానుంది. అయితే 12 నెలల విరామం తరువాత, బుధ గ్రహం మే 31 మధ్యాహ్నం 12:02 గంటలకు వృషభరాశిలోకి ప్రవేశించనుంది. దీని వల్ల  మేష, కన్యా, మీన రాశుల వారికి అద్భుతమైన లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పడబోతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. . ... మిగతా రాశుల వారికి  జ్యోతిష్య నిపుణుల ప్రకారం ఎలా  ఉందో  తెలుసుకుందాం.

1. మేష రాశి : ఈ రాశి వారికి లక్ష్మీ నారాయణ రాజ్యయోగం చాలా శుభప్రదంగా ఉండబోతుంది. పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. గౌరవం కూడా పెరిగి, సంపదకు కొత్త మార్గాలు తెలిసే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు ఇంట్లోను కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. కష్టపడి పనిచేసే వారికి విజయం లభిస్తుంది. ప్రమోషన్, ఇంక్రిమెంట్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువే ఉన్నాయి. ఈ రాశికి చెందిన వ్యక్తుల్లో వ్యాపారం చేసే వారు ఉంటే చాలా ప్రయోజనాలు పొందుతారు. ఆత్మవిశ్వాసం పెరిగి, ఇది విజయం సాధించడంలో తోడ్పడుతుంది. అయితే  ఈ సమయంలో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మేష రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందటం కోసం బుధవారం నాడు గోమాతకు పచ్చి మేత తినిపించాలి.

2. వృషభ రాశి: శుక్రుడు వృషభ రాశికి అధిపతి. శుక్రుడు, బుధుడు స్నేహపూర్వక గ్రహాలు.  వృషభరాశిలో బుధ గ్రహ సంచారం కారణంగా  ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఖర్చులు పెరుగుతాయి. విదేశీ ప్రయాణం ఖర్చుతో కూడుకొని ఉంటుంది. ఇంట్లో కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురవుతారు. తల్లిదండ్రులు తమ పిల్లలను విదేశాలకు పంపాలనుకుంటే ఈ సమయంలో అది సాధ్యమవుతుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు లభిస్తాయి. సమాజంలో కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారం ప్రయోజనకరంగా ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించాలి లేదంటే ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుంది. ఎవరితోను వివాదాలకు దిగకుండా ఉండటమే మంచిది. బుధుడి అనుగ్రహం కోసం బుధవారం ఉపవాసం ఉండాలి.

3. మిథున రాశి : బుధుడు... వృషభరాశిలో సంచారం వలన .. మిథున రాశి వారికి ప్రత్యేక బహుమతులు ఇవ్వబోతున్నాడు. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. వ్యాపారం ప్రారంభిస్తే ఊహించని విజయం, లాభాలు లభిస్తాయి. ఉన్నతాధికారులతో సానుకూల సంబంధాలు ఉంటాయి. జీవిత భాగస్వామిని సంతోషపెడతారు. ఆగిపోయిన పనులు ముందుకు సాగుతాయి. ఈ సమయంలో ఇల్లు కొనడానికి ప్రయత్నిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో  అనుకోకుండా మంచి మార్పులు సంభవిస్తాయి. విద్యార్థులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది.  ఇంకా మంచి ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్రనామ స్తోత్రము పఠించాలి.

4. కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి వృషభరాశిలో  బుధుడి సంచారం వల్ల సామర్థ్యం మెరుగుపడుతుంది. పనిలో ముందుకు సాగుతారు. స్వల్ప ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ తెలివితేటలతో వాటిని అధిగమిస్తారు. పనిలో గుర్తింపు పొందుతారు. ఈ సమయంలో ఉద్యోగంలో ప్రమోషన్ పొంది మరొక ప్రదేశానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. పని ఒత్తిడి ఉంటుంది. బుధవారం గణపతిని పూజించాలి.

5. సింహ రాశి: వృషభరాశిలో బుధు సంచారం  వలన డబ్బు, ఆనందాన్ని ఇస్తుంది. ఉద్యోగంలో విజయం లభిస్తుంది. పూర్వీకుల నుంచి ఆస్తి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వినోదం కోసం మీ కుటుంబంతో పిక్నిక్ కి వెళ్తారు. సమాజంలో గౌరవం పొందుతారు. బుధవారం పచ్చని మొక్కలు పెంచి వాటికి నీరు పోయడం వల్ల బుధుడి అనుగ్రహం లభిస్తుంది.

6. కన్యా రాశి: బుధుడు వృషభరాశిలోప్రవేశించడంతో లక్ష్మీ నారాయణ యోగంతో కన్యా రాశికి చెందిన వ్యక్తులు త్వరలో అదృష్టవంతులు కాబోతున్నారు. పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తారు. పనిలో కష్టపడి విజయాలు సాధిస్తారు. ఆర్థిక పరిస్థితిలో కూడా లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు లభించనుంది. వైవాహిక జీవితంలో ప్రేమ పెరుగుతుంది. ఈ రాశుల వారికి ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ పొందే అవకాశం కలదు.  అయితే ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. 

7. తులా రాశి: తులా రాశి జాతకులకు వృషభరాశిలో బుధ గ్రహ సంచారం వలన  మిశ్రమ ఫలితాలను పొందుతారు. వ్యాపార భాగస్వాములతో సంబంధం మెరుగుపడుతుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించేందుకు అవకాశాలు లభిస్తాయి. అదృష్టం పూర్తి మద్దతు ఉంటుంది. విదేశాలకు వెళ్లడం ద్వారా డబ్బు సంపాదిస్తారు. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి.  అవివాహిత వ్యక్తులకు వివాహం కుదురుతుంది. బుధవారం రోజు క్రమం తప్పకుండా ఓం బం బుధాయ నమః మంత్రాన్ని జపించాలి.

8.వృశ్చిక రాశి: ఈ రాశి  వారికి  ఈ సమయం లాభదాయకంగా ఉండదు. వృత్తిపరమైన, శారీరక పరంగా సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ప్రత్యర్థుల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఆదాయాన్ని కోల్పోతారు. ఉద్యోగంలో మీకు ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయి. ఎవరితోనూ వాదనలు పెట్టుకోవద్దు. అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి.బుధవారం నాడు గణేశుడుకి దుర్వా గడ్డిని సమర్పిస్తే కొంత అనుకూలంగా ఉంటుంది.

9 ధనుస్సు రాశి: వృషభరాశిలో  బుధుడి సంచారం వల్ల ధనుస్సు రాశి వారి ఆదాయం పెరుగుతుంది. వ్యాపారంలో పోటీని తట్టుకొని నిలబడగలుగుతారు. గౌరవాన్ని అందుకుంటారు. పనికి గుర్తింపు లభిస్తుంది. అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. 

10. మకర రాశి: వృషభరాశిలో  బుధుడి సంచారం  మకర రాశి వారికి అనుకూల ఫలితాలు కలుగుతాయి. తోబుట్టువులతో గొడవలు ఉంటే వాటిని పరిష్కరించుకుంటారు. రుణాలు పొందుతారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పనిలో ఒత్తిడి తక్కువగా ఉంటుంది . కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. ఫలితంగా మనసు సంతోషంగా ఉంటుంది..

11. కుంభ రాశి: చదువులో పురోగతి ఉంటుంది. ప్రయాణాలకు దూరంగా ఉండాలి లేదంటే డబ్బు నష్టపోతారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. బుధుడి అనుగ్రహం కోసం బుధవారం నాడు మీ సోదరికి ఆకుపచ్చ రంగు గాజులు లేదా ఆకుపచ్చ రంగు దుస్తులు ఇవ్వండి. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. 

12. మీన రాశి: లక్ష్మీ నారాయణ యోగం వల్ల మీన రాశి వ్యక్తులు అన్ని రంగాలలో విజయం సాధించనున్నారు. కెరీర్‌తో పాటు ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. నిర్దేశించిన లక్ష్యాన్ని కూడా చేరుకుంటారు. ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉంటాయి. ప్రేమ జీవితం బాగుంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది.