సనత్ నగర్ లో డ్రగ్స్ కలకలం.. ఐదుగురు యువకులు అరెస్ట్

సనత్ నగర్ లో డ్రగ్స్ కలకలం.. ఐదుగురు యువకులు అరెస్ట్

ఇటీవల హైదరాబాద్ సీటీలో డ్రగ్స్ కల్చర్ విపరీతంగా పెరిగిపోయింది.  విచ్చలవిడిగా డ్రగ్స్ దొరుకుతుండడంతో యువత.. దానికి అడిక్ట్ అవుతున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో డ్రగ్స్ అరికట్టేందుకు పలు చర్యలు తీసుకుంటూ పోలీస్ అధికారులను అలర్ట్ చేసింది. డ్రగ్స్ సరఫరా చేసే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అయినా డ్రగ్స్ అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. నగరంలో ఏదో ఒక చోటు డ్రగ్స్ పట్టుబడుతూనే ఉంది. తాజాగా సనత్ నగర్ లో డ్రగ్స్ కలకలం రేపుతోంది.

ఏప్రిల్ 10వ తేదీ బుధవారం రాజేంద్రనగర్ ఎస్ఓటీ టీమ్ సనత్ నగర్ లో తనిఖీలు చేపట్టి  MDMA డ్రగ్స్ సీజ్ చేసింది. ఇటీవల ఐదుగురు యువకులు గోవాలో పుట్టిన రోజు జరుపుకుని హైదరాబాద్ కు తిరిగొచ్చారు. వారితోపాటు డ్రగ్స్ ను కూడా తీసుకొచ్చారు.  సమాచారం అందుకున్న ఎస్ఓటి పోలీసులు దాడులు చేసి.. ఐదుగురు యువకులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.నిందితుల నుంచి 4 గ్రాముల MDMA, 5 గ్రాముల గంజాయితో పాటు OCB ప్లేవర్స్ డ్రగ్స్, 5 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. పుట్టిన రోజు పార్టీలోనూ డ్రగ్స్ వినియోగించినట్లు గుర్తించారు. నిందితులపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సనత్ నగర్ పోలీసులు తెలిపారు.