పిడుగు పాటుకు కాలిపోయిన కొబ్బరి చెట్టు

పిడుగు పాటుకు కాలిపోయిన కొబ్బరి చెట్టు

హైదరాబాద్లో మరోసారి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షం పడింది.   రాజేంద్రనగర్ వ్యవసాయ యూనివర్సిటీ బ్యాక్ సైడ్ రాజేంద్రనగర్ జోన్  డీసీపీ కార్యాలయం ప్రాంగణంలో పిడుగుపాటుకు  కొబ్బరి చెట్టు కాలిపోయింది. ఈ దృశ్యాన్ని కొందరు వీడియో తీశారు. భయంతో కొందరు పరుగులు తీశారు.  శంషాబాద్ ఎయిర్ పోర్ట్,  బషీర్ బాగ్ , బేగంబజార్, కోఠి, మీర్ పేట్,  చాంద్రాయణగుట్ట, ఫలక్ నుమా, ఛత్రినాక, శాలిబండ  ప్రాంతాల్లో గాలితో కూడుకున్న వర్షం కురిసింది.

ఉదయం ఎండలు, సాయంత్రం వర్షాలతో  నగర వాసులు ఇబ్బంది పడుతున్నారు.  మార్నింగ్ 8 గంటల నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. మధ్యాహ్నం వరకు తీవ్రమవుతున్నాయి. ఎండలు ఎక్కువవడంతో జనం కూడా బయటకు వెళ్లాలంటే ఆలోచిస్తున్నారు.  సాయంత్రం కాగానే బయటకు వెళ్దామనుకునే సరికి వర్షాలు పడుతున్నాయి. ఈ అకాల వర్షాలు జనాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. గ్రామాల్లో వరి చేన్లు, మామిడి తోటలు దెబ్బతింటున్నాయి. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.