V6 News

చార్జ్ తీసుకున్న వనపర్తి అదనపు ఎస్పీ రాజేశ్ మీనా

చార్జ్ తీసుకున్న వనపర్తి అదనపు ఎస్పీ రాజేశ్ మీనా

వనపర్తి, వెలుగుః  వనపర్తి జిల్లా కొత్త అదనపు ఎస్పీ (అడ్మిన్)గా రాజేశ్​మీనా నియమితులయ్యారు. మంగళవారం ఆయన జిల్లా ఇన్-ఛార్జ్ ఎస్పీ వినీత్‌‌‌‌‌‌‌‌ను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేశారు. నిర్మల్ జిల్లా భైంసా ఏఎస్పీగా విధులు నిర్వహించిన రాజేశ్​మీనా బదిలీపై వనపర్తికి వచ్చారు.

ఈ సందర్భంగా ఎస్పీ వినీత్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి, పోలీస్ శాఖపై వారు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టేలా బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో నిబద్ధతతో ఉంటూ, ప్రజల సమస్యలను సానుకూల దృక్పథంతో పరిష్కరించాలని పేర్కొన్నారు.