సంక్రాంతి రేసులో రజినీకాంత్

సంక్రాంతి రేసులో రజినీకాంత్

రజినీకాంత్ హీరోగా కమల్ హాసన్ నిర్మాణంలో  తమిళ దర్శకుడు  శిబి చక్రవర్తి కాంబినేషన్‌‌‌‌లో ఇటీవల  ఓ సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ గురించి కొన్ని క్రేజీ అప్‌‌‌‌డేట్స్‌‌‌‌ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఏప్రిల్‌‌‌‌లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి,  సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ నెలాఖరు కల్లా మొత్తం షూట్​ను  పూర్తి చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

అలాగే వచ్చే ఏడాది  పొంగల్ రేసులో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే సంక్రాంతి బరిలో ఇప్పటికే టాలీవుడ్  స్టార్ హీరోలు స్లాట్స్‌‌‌‌ కోసం పోటీపడుతున్న తరుణంలో సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ఈ పోటీలో ఉండటం ఆసక్తి నెలకొంది.  రజినీకాంత్ హీరోగా నటిస్తున్న 173వ చిత్రం ఇది.  ఇతర నటీనటులు, టెక్నీషియన్స్  వివరాలు తెలియాల్సి ఉంది.

మరోవైపు రజినీకాంత్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్‌‌‌‌‌‌‌‌తో ‘జైలర్ 2’ మూవీ చేస్తున్నారు.  అలాగే నెల్సన్ డైరెక్షన్‌‌‌‌లోనే  రజినీకాంత్, కమల్ హాసన్ హీరోలుగా రీసెంట్‌‌‌‌గా  ఓ చిత్రాన్ని ప్రకటించారు. ఉదయనిధి స్టాలిన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.