Jailer 2 Trailer: ‘జైలర్ 2’ ట్రైలర్‌తో తలైవా ర్యాంపేజ్.. అనిరుధ్ బీజీఎం మోత, రజినీ స్వాగ్‌కు పూనకాలే!

Jailer 2 Trailer: ‘జైలర్ 2’ ట్రైలర్‌తో తలైవా ర్యాంపేజ్.. అనిరుధ్ బీజీఎం మోత, రజినీ స్వాగ్‌కు పూనకాలే!

సూపర్‌స్టార్ రజినీకాంత్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్ వచ్చేసింది. ట్రైలర్‌ను చూస్తే ఫుల్ మాస్ యాక్షన్ ట్రీట్‌తో సినిమా సిద్ధమవుతున్నట్లు అర్థమవుతోంది. తలైవా తనదైన స్టైల్, స్వాగ్‌తో మరోసారి అదరగొట్టారు.

రజినీకాంత్ మాస్ యాక్షన్ సీక్వెన్సులు, పవర్‌ఫుల్ డైలాగ్ డెలివరీ, స్టైలిష్ స్క్రీన్ ప్రెజెన్స్ ట్రైలర్‌కు మెయిన్ హైలైట్‌గా నిలిచాయి. ముఖ్యంగా తలైవా స్వాగ్ అభిమానులను ఫుల్ ఖుషీ చేసేలా ఉంది. కొత్త క్యారెక్టర్స్‌ను పరిచయం చేస్తూ ట్రైలర్‌కు మరింత గ్రాండియర్ లుక్ తీసుకొచ్చారు. మోహన్ లాల్, శివన్న క్యారెక్టర్స్ పార్ట్ 1లో ఉండగా.. ఇందులో వర్సటైల్ యాక్టర్స్ సూరజ్ వెంజరమూడు, విద్యా బాలన్, Sj సూర్య వంటి తదితర పాత్రలు సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. 

ఇక ‘జైలర్’తో బ్లాక్‌బస్టర్ అందుకున్న దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్.. ‘జైలర్ 2’పై అంచనాలు మరింత పెరిగేలా ట్రైలర్‌ను కట్ చేశారు. యాక్షన్, కామెడీ, స్టైల్‌తో తన మార్క్‌ను మరోసారి చూపించారు. అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ ఇంపాక్ట్‌ను మరింత పెంచింది. ప్రతి యాక్షన్ బీట్‌కు అదిరిపోయే ఎలివేషన్ ఇస్తూ ఆడియన్స్‌కు థియేట్రికల్ ట్రీట్ ఎలా ఉండబోతుందో చూపించింది. మొత్తంగా ‘జైలర్ 2’ ట్రైలర్ పీక్ లెవల్ మాస్ ఎలివేషన్స్‌తో సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. ఈ సినిమా అక్టోబర్ 15న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.