Jailer Movie Review: రజనీకాంత్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్

Jailer Movie Review: రజనీకాంత్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth) హీరోగా చేసిన లేటెస్ట్ మూవీ జైలర్(Jailer). నెల్సన్ కుమార్(Nelson kumar) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. తమన్నా(thamannaah), మోహన్ లాల్(Mohan lal), శివరాజ్ కుమార్(Shivaraj kumar), సునీల్(Sunil) తదితరులు నటించిన ఈ సినిమా ఆగస్టు 10 శుక్రవారం రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి జైలర్ సినిమా ప్రేక్షకులను ఏమేరకు మెప్పించింది అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం. 

కథ: ముత్తు(రజినీకాంత్) అలియాస్ టైగర్ ముత్తువేల్ పాండియన్ ఒక రిటైర్డ్ జైలర్. తన కుటుంబంతో కలిసి సంతోషంగా నివసిస్తుంటాడు. ముత్తు కొడుకు అర్జున్(వసంత్ రవి) ఒక పోలీస్ ఆఫీసర్. చాలా నిజాయతీపరుడు. అతను ఒక ముఠాను పట్టుకోవడం కోసం తీవ్రంగా శ్రమిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో అతడు కనిపించకుండా పోతాడు. కొడుకు ఆచూకీ కోసం ముత్తు ఎం చేశాడు? చివరకు కొడుకుని కనిపెట్టాడా? అసలు ఈ టైగర్ ముత్తువేల్ పాండియన్ కథ ఏంటి? అనేది తెలియాలంటే 'జైలర్' చూడాల్సిందే.

విశ్లేషణ: అరక్కోణం ఊరిలో ఓ గుడిలో పూజారిని చంపేసి, విగ్రహాం దొంగతనం చేసే సీన్‌తో జైలర్ సినిమా మొదలవుతుంది. ఈ కేసు డీల్ చేస్తున్న ముత్తు కొడుకు కొన్నాళ్లకు కనిపించకుండా పోవడం, ముత్తు పోలీసుల దగ్గరకెళ్లడం.. ఇలాంటి సీన్స్ తో మంచి ఫ్లోలో వెళ్తుంది సినిమా. ప్రేక్షకులకు మంచి ఎంటెర్టైమెంట్ అందిస్తాయి ఆ సీన్స్. ఇక ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ అయితే నెక్స్ట్ లెవల్లో ఉంటాయి. సెకండ్ హాఫ్ పై మంచి హైని క్రియేట్ చేస్తాయి.

అయితే ఇంటర్వెల్ వరకు స్టోరీని సూపర్ గా హ్యాండిల్ చేసిన నెల్సన్ కుమార్.. సెకండాఫ్‌లో మాత్రం ఆ హైప్ ను కంటిన్యూ చేయలేకపోయాడు. స్క్రీన్ ప్లేలో క్లారిటీ ఉండదు. అసలేం జరుగుతుందో కూడా ప్రేక్షకులకు అర్థంకాని పరిస్థితి. మళ్ళీ క్లైమాక్స్  వచ్చేసరికి స్టోరీ గాడిలో పడుతుంది. క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సీన్స్, ఊహించని ట్విస్టులతో ఎండ్ కార్డ్ పడుతుంది. నిజానికి జైలర్ సినిమాలో కొత్తగా చెప్పుకోడానికి ఏమీలేదు. కేవలం రజనీకాంత్ హీరోయిజం తప్పా. తన మొదటి సినిమా నుండి డార్క్ కామెడీ ఫార్ములాను ఫాలో అవుతున్న నెల్సన్.. 'జైలర్' కు కూడా అదే ఫార్ములా ఎంచుకున్నారు. మధ్య మధ్యలో వచ్చే కామెడీ సీన్స్ తప్ప చెప్పుకోవడానికి పెద్దగా ఏమీలేదు కానీ.. రజని ఫ్యాన్స్ మాత్రం ఫుల్లుగా ఎంజాయ్ చేస్తారు.  

నటీనటులు: జైలర్ సినిమా గురించి ఒక్కముక్కలో చెప్పాలంటే ఇది రజినీకాంత్ వన్ మ్యాన్ షో. వయసుకు తగ్గ పాత్రలో మాస్-క్లాస్-యూత్-ఫ్యామిలీ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని కవర్ చేస‍్తూ ఎంటర్‌టైన్ చేశారు రజనీకాంత్. తన మార్క్ మేనరిజమ్స్‌తో ఆడియన్స్ చేత విజిల్స్ వేయించారు. ఇక వసంత్ రవి కూడా పాత్ర మేరకు బాగానే ఆకట్టుకున్నారు. అతిథి పాత్రల్లో కనిపించిన శివరాజ్ కుమార్, జాకీష్రాఫ్, మోహన్ లాల్ కూడా బానే చేశారు. విలన్‌గా మలయాళ నటుడు వినాయగన్, సునీల్, యోగిబాబు, వీటీవీ గణేశ్ తమ తమ పాత్రల మేరకు పర్వాలేదనిపించారు. ఇక తమన్నా అయితే ఓ పాట, రెండు మూడు సీన్స్‌లో కనిపించి తన గ్లామర్ తో ఆకట్టుకుంది. 

ALSO READ :లైగర్ మూవీ ఫ్లాప్ పై విజయ్ దేవరకొండ రెస్పాండ్.. ఇక పై నోర్మూసుకుని ఉంటా

సాంకేతిక నిపుణులు: జైలర్ సినిమాలో రజినీకాంత్ తర్వాత సినిమాను నిలబెట్టింది అంటే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ అనే చెప్పాలి. తన ఎలక్ట్రిఫైయింగ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లాడు. సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. ఎడిటింగ్, సన్ పిక్చర్స్ నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.

ఇక జైలర్ సినిమా గురించి ఒక్కముక్కలో చెప్పాలంటే.. రజనీకాంత్ ఫ్యాన్స్ కు ఒకే కానీ.. నార్మల్ ఆడియెన్స్‌కి మాత్రం 'జైలర్' కాస్త డిజప్పాయింట్మెంట్ ఇస్తుంది.