రజినీకాంత్ హీరోగా కమల్ హాసన్ నిర్మాతగా ఇటీవల ఓ సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ‘డాన్’ ఫేమ్ శిబి చక్రవర్తి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. మాస్ అప్పీల్, ఎమోషన్, హై క్వాలిటీ మేకింగ్‌తో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు మేకర్స్ తెలియజేశారు. రజినీకాంత్ కెరీర్‌లో ఇది 173వ చిత్రం. ప్రస్తుతం రజినీకాంత్ ‘జైలర్ 2’ చిత్రీకరణలో బిజీగా ఉండగా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌ను సమ్మర్‌లో స్టార్ట్ చేయనున్నారట.
ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది పొంగల్‌కి రిలీజ్ చేయనున్నట్టు తెలియజేశారు. రజినీకాంత్, కమల్ కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రం కావడంతో దీనిపై ఇప్పటికే అంచనాలు ఏర్పడ్డాయి.
