జైలర్ ఇంట్లోకి వచ్చేశాడు.. శ్రీకృష్ణాష్టమి స్పెషల్ OTT మూవీ

జైలర్ ఇంట్లోకి వచ్చేశాడు.. శ్రీకృష్ణాష్టమి స్పెషల్ OTT మూవీ

తలైవా రజనీకాంత్​ నటించిన ‘జైలర్’​ సినిమా ఓటీటీ రిలీజ్​ డేట్​ ఫిక్స్​ అయ్యింది. 2023, సెప్టెంబర్ 7వ తేదీ అర్థరాత్రి 12 గంటల నుంచే ఈ మూవీని ఓటీటీలో రిలీజ్​ చేయనున్నారు. అమెజాన్​ ప్రైమ్​ ఈ సినిమా రైట్స్​కొనుగోలు చేసింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్​ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ హీరో కెరీర్​లోనే అత్యధికంగా రూ. 640 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. దీంతో రజనీ ఫ్యాన్స్​ పండగ చేసుకుంటున్నారు. 

ఇప్పుడు ఓటీటీలో విడుదలై ఈ సినిమా ఎన్ని రికార్డులు నమోదు చేస్తుందో చూడాలి. శ్రీ కృష్ణాష్టమి స్పెషల్ గా ఇది స్ట్రీమింగ్ అవుతుంది. అమెజాన్ ప్రైమ్ లో OTT ఫ్లాట్ ఫాంలో అందుబాటులో ఉండనుంది. సినిమా విడుదలై నెల రోజులు కూడా కాకుండానే OTTలోకి రావటం విశేషం. ఇప్పుడు కూడా ధియేటర్లలో కొద్దో గొప్పో కలెక్షన్స్ వస్తున్నాయి. ఇలాంటి టైంలోనే.. జైలర్ మూవీ OTTలోకి రిలీజ్ చేయటం విశేషం. 

Also Read :- యూఎస్ ఓపెన్ సెమీస్ లో జొకోవిచ్.. ఫెదరర్ ఆల్ టైం రికార్డ్ బ్రేక్

ముందు ఉన్న సమాచారం ప్రకారం.. వినాయకచవితి పండక్కి OTT రిలీజ్ అనుకున్నారు.. అందుకు భిన్నంగా 10 రోజుల ముందే రిలీజ్ కావటం ఆసక్తి రేపుతోంది.