యూఎస్ ఓపెన్ సెమీస్ లో జొకోవిచ్.. ఫెదరర్ ఆల్ టైం రికార్డ్ బ్రేక్

యూఎస్ ఓపెన్ సెమీస్ లో జొకోవిచ్.. ఫెదరర్ ఆల్ టైం రికార్డ్ బ్రేక్

 

యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ లో సెర్బియన్ స్టార్ జొకోవిచ్ సెమీస్ లోకి దూసుకెళ్లాడు. మంగళవారం రాత్రి జరిగిన క్వార్టర్ ఫైనల్స్ లో టైలర్ ఫ్రిట్జ్ పై  6-1, 6-4, 6-4 తేడాతో వరుస సెట్లలో నెగ్గాడు. తొలి సెట్ నుంచే దూకుడిని ప్రదర్శించిన నోవాక్.. ఫ్రిట్జ్ కి ఏ చిన్న  అవకాశం కూడా ఇవ్వలేదు. ఇప్పటికే ముఖాముఖిలో 7 సార్లు ఓడిపోయిన ఫ్రిట్జ్.. నిన్న ఓటమితో ఆ సంఖ్యను 8 కి పెంచుకున్నాడు. ఎంతోకాలం టాప్ 10 లో కొనసాగిన ఫ్రిట్జ్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా జొకోవిచ్ ని ఓడించలేకపోయాడు. 

ఫెదరర్ ఆల్ టైం రికార్డ్ బ్రేక్:

 యూఎస్ ఓపెన్ సెమీస్ లోకి ప్రవేశించడం ద్వారా జొకోవిచ్ అత్యధిక సార్లు గ్రాండ్ స్లామ్ సెమీ ఫైనల్ కి చేరిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు జొకోవిచ్ 47 సార్లు గ్రాండ్ స్లామ్ లో సెమీస్ లోకి అడుగుపెట్టాడు. వీటిలో 23 టైటిల్స్ నోవాక్ ఖాతాలోకి వెళ్లాయి. ఫెదరర్(46), రఫెల్ నాదల్(38) ఈ లిస్టులో వరుసగా రెండు మూడు స్థానాల్లో నిలిచారు.
 
మరో క్వార్టర్ ఫైనల్స్ లో అమెరికా స్టార్ తియాఫోకి షెల్టాన్ షాకిచ్చాడు. 6-2,3-6,7-6(9-7),6-2 తేడాతో నెగ్గి యూఎస్ ఓపెన్  సెమీస్ లో జొకోవిచ్ తో పోరుకి సిద్ధమయ్యాడు. ఇక మహిళల సవిషయానికి వస్తే కోకో గాఫ్ 6-0, 6-2 తేడాతో ఒస్తాపెంకో ని చిత్తు చేస్తే మరో  క్వార్టర్ ఫైనల్స్ లో ముచ్చోవ 6-0,6-3 తేడాతో క్రిస్టిపై సునాయాస విజయం సాధించింది.