రామారావు ఆన్ డ్యూటీ రాజీషా విజయన్ ఎంట్రీ

రామారావు ఆన్ డ్యూటీ  రాజీషా విజయన్ ఎంట్రీ

ఇప్పటికే మలయాళ, తమిళ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న రాజీషా విజయన్.. ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ మూవీ జులై 29న విడుదలవుతోంది. ఈ సందర్భంగా రాజీషా ఇలా ముచ్చటించింది. ‘‘ధనుష్‌‌‌‌తో కలిసి నటించిన ‘కర్ణన్’ సినిమాలో నన్ను చూసి ఈ మూవీకి తీసుకున్నారు. రవితేజ గారితో వర్క్ చేయాలని, ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని చెప్పారు. మాలిని పాత్రలో కనిపిస్తాను. యాక్టింగ్‌‌‌‌కి స్కోప్‌‌‌‌ ఉండే క్యారెక్టర్. నార్త్​లో పెరగడంతో రవితేజ సినిమాల్ని ఎప్పుడూ  హిందీలో చూసేదాన్ని. దాంతో మొదట్లో ఆయన హిందీ యాక్టరే అనుకునేదాన్ని. మా ఫ్రెండ్స్ అందరికీ కూడా ఆయన తెలుసు. మొదటి రోజు చాలా ఎక్సైటింగ్‌‌‌‌గా సెట్‌‌‌‌కి వెళ్లాను. కానీ ఆ రోజే శాడ్  సీన్ చేయాల్సి వచ్చింది. రవితేజ చాలా ఎంకరేజ్ చేశారు.

ఎప్పుడూ ఎనర్జిటిక్‌‌‌‌గా ఉంటారు. సెట్‌‌‌‌లో ప్రొడక్షన్ బాయ్ దగ్గర్నుంచి ప్రతి ఒక్కర్నీ ఒకేలా ట్రీట్ చేస్తారు. ఇదొక మాసివ్ సినిమా. యాక్షన్ సీక్వెన్సెస్‌‌‌‌తో పాటు ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌మెంట్ కూడా ఉంటుంది. 1995 బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో  సోషల్ ఇష్యూపై  సాగే ఈ కథ అందర్నీ ఆలోచింపజేస్తుంది. దివ్యాంశతోనూ నాకు కాంబినేషన్ సీన్స్ ఉంటాయి. సినిమాలో మొత్తం నాలుగు పాటలు ఉన్నాయి. నాతో చేసిన  ‘బుల్ బుల్ తరంగ్’ సాంగ్‌‌‌‌కి ఆల్రెడీ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏ భాషలో వర్క్ చేసినా టెక్నికల్ ప్రాసెస్ అంతా సేమ్. అదే మేకింగ్, అదే యాక్టింగ్. కానీ తెలుగు సినిమాలకు బడ్జెట్ ఎక్కువ. అక్కడ సింగిల్ షెడ్యూల్‌‌‌‌లో ఫినిష్ చేస్తే.. ఇక్కడ ఎక్కువ షెడ్యూల్స్ వర్క్ చేస్తారు. కేరళ మొత్తంలో రెండొందలకు పైగా థియేటర్స్‌‌‌‌ ఉంటే.. ఆంధ్ర, తెలంగాణలో కలిపి వెయ్యికి పైగా థియేటర్స్‌‌‌‌ ఉన్నాయి. తెలుగు ఆడియెన్స్‌‌‌‌ స్టార్స్‌‌‌‌ని చాలా అభిమానిస్తారు. ఓటీటీ వచ్చాక లాంగ్వేజ్ బ్యారియర్స్ చెరిగిపోయాయి. అందుకు మంచి స్ర్కిప్టులే కారణం. ఫహాద్ ఫాజిల్‌‌‌‌తో నటించిన మలయాళ సినిమా ‘మలయన్ కుంజు’ నిన్న రిలీజయ్యింది. 29న ‘రామారావు ఆన్ డ్యూటీ’ విడుదలవుతోంది. కార్తితో కలిసి యాక్ట్ చేస్తున్న ‘సర్దార్‌‌‌‌‌‌‌‌’ షూటింగ్‌‌‌‌తో పాటు రీసెంట్‌‌‌‌గా డబ్బింగ్ కూడా కంప్లీట్ చేసేశాను. మరో నాలుగు మలయాళ సినిమాలు రిలీజ్‌‌‌‌కి రెడీగా ఉన్నాయి. మరో రెండు సెట్స్‌‌‌‌పై ఉన్నాయి.’’