టెక్నికల్ విప్లవానికి నాంది పలికింది రాజీవ్ గాంధీ: ఉత్తమ్

టెక్నికల్ విప్లవానికి నాంది పలికింది రాజీవ్ గాంధీ: ఉత్తమ్

సాంకేతిక విప్లవానికి నాంది పలికింది రాజీవ్ గాంధీనే  అని అన్నారు  టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాజీవ్ గాంధీ 75 వ జయంతి సోమాజీగూడ చౌరస్తాలో జరిగాయి.  పీసీసీ చీఫ్ ఉత్తమ్ ,మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఉపాధ్యక్షులు మల్లు రవి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ హనుమంతరావు రాజీవ్ గాంధీ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడిన ఉత్తమ్..  భారతదేశంలో చాలా తక్కువ టైమ్ లో టెక్నీకల్ విప్లవంను రాజీవ్ గాంధీ తీసుకువచ్చారని అన్నారు.  చైనా కంటే మన దేశంలో ఎక్కువ సెల్ ఫోన్ లను వినియోస్తున్నామన్నారు. బీజేపీ నేతలు గాంధీ, నెహ్రు కుటుంబం చేసిన త్యాగాలను తక్కువ చేసి మాట్లాడటం సరికాదన్నారు.  నెహ్రు,పటేల్ చేసిన త్యాగాలను ఒక్క పటేల్ మాత్రమే  చేసినట్టు మాట్లాడుతున్నారని అన్నారు. ఎస్సీ,ఎస్టీ బీసీ రిజర్వేషన్లపై మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని…రిజర్వేషన్ లు కొనసాగించాలని అన్నారు ఉత్తమ్..