రాజీవ్ పార్క్ ను అభివృద్ధి చేయాలి : నిర్మలాజగ్గారెడ్డి

రాజీవ్ పార్క్ ను అభివృద్ధి చేయాలి : నిర్మలాజగ్గారెడ్డి

కొండాపూర్, వెలుగు : సంగారెడ్డిలోని రాజీవ్ పార్క్ ను అభివృద్ధి చేయాలని కోరుతూ టీజీ ఐసీసీ చైర్మన్ నిర్మలాజగ్గారెడ్డి కలెక్టర్ ప్రవీణ్యను కలిశారు. ఈ సందర్భంగా ఆమె కలెక్టర్ తో కలిసి రాజీవ్ పార్కు సందర్శించారు.  రూ.3 కోట్లతో టీయూఏఫ్ఐడీసీ నిధులతో రాజీవ్ పార్క్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు  కలెక్టర్​ చెప్పారు. 

లైటింగ్, టాయిలెట్ బ్లాక్, ల్యాండ్ స్కేపింగ్ చేయించాలని సంబంధించిన అధికారులు వివరించారు. అనంతరం జగ్గారెడ్డి మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు స్థానిక ప్రజలకు ఆహ్లాదం అందించేలా రాజీవ్ పార్క్ ను తీర్చిదిద్దామని చెప్పారు. స్విమ్మింగ్ పూల్ కు ఆనుకుని ఉన్న స్థలంలో పీపీటీ పద్ధతిలో స్పోర్ట్స్ ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు రూపొందించాలని కలెక్టర్​ అధికారులను ఆదేశించారు.