
- స్పీడ్‌గా కొనసాగుతున్న వెరిఫికేషన్
- వచ్చే నెల 2న ప్రొసీడింగ్స్ అందించేందుకు కసరత్తులు
- ఉమ్మడి జిల్లాలో 1,72,985 అప్లికేషన్లు
జనగామ, వెలుగు : యువతకు ఉపాధి కల్పించేందుకు సర్కారు ప్రవేశ పెట్టిన రాజీవ్ యువవికాసం పథకం అమలుకు ముమ్మరంగా కసరత్తు జరుగుతోంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందించనున్నారు. అప్లికేషన్ల వెరిఫికేషన్‌ను శరవేగంగా చేపడుతోంది. కాగా, రూ.50 వేలు, రూ.లక్ష సాయానికి సంబంధించిన యూనిట్లకు తక్కువగా, రూ.2 లక్షలు, రూ.4 లక్షల యూనిట్ల కోసం పెద్ద మొత్తంలో పోటీ నెలకొంది.
పెద్ద యూనిట్ల వైపే మొగ్గు..
రాజీవ్ యువ వికాసం పథకంలో యువత పెద్ద యూనిట్ల వైపే మొగ్గు చూపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ, వరంగల్, హనుమకొండ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ లో మొత్తంగా 1,72,985 మంది రాజీవ్ యువవికాసం పథకానికి అప్లై చేసుకున్నారు. సిబిల్ స్కోర్ ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు మండల కమిటీలు వెరిఫికేషన్‌ను చేపడుతున్నాయి. జనగామ జిల్లాలో మొత్తంగా 29,367 మంది ప్లై చేసుకోగా, ఇందులో ఎస్సీ కార్పోరేషన్ పరిధిలో 3,500ల యూనిట్లకు 8,679 మంది అప్లై చేశారు.
ఎస్టీ కార్పోరేషన్ పరిధిలో 1,809 యూనిట్లకు 3,787 మంది, బీసీ కార్పోరేషన్ పరిధిలో 2,714 యూనిట్లకు 15,757, మైనార్టీ కార్పోరేషన్ పరిధిలో 186 యూనిట్లకు 981, క్రిస్టియన్ మైనార్టీ కార్పోరేషన్ పరిధిలో 57 యూనిట్లకు 48 మంది, ఈబీసీ 511 యూనిట్లకు 447 మంది అప్లై చేసుకున్నారు. కాగా, రూ.50 వేలు, లక్ష లోపు యూనిట్లకు మంజూరు ఉన్న యూనిట్ల కంటే తక్కువ అప్లికేషన్లు వచ్చాయి. వీటిలో బీసీ కార్పోరేషన్ పరిధిలో 100 శాతం సబ్సిడీ ఉన్న రూ.50 వేల సాయానికి 1,134 యూనిట్లు కేటాయించగా, కేవలం 354 మంది మాత్రమే అప్లై చేసుకున్నారు. 90 శాతం సబ్సిడీ పై అందించే రూ.లక్ష సాయానికి 595 యూనిట్లకు అనుమతి ఉండగా, 466 మంది మాత్రమే అప్లై చేసుకున్నారు.
80 శాతం సబ్సిడీ పై అందించే రూ.2 లక్షల సాయానికి 591 యూనిట్లకు అనుమతి ఉండగా 2,046 మంది, 70 శాతం సబ్సిడీ పై అందించే రూ.4 లక్షల సాయానికి 394 యూనిట్లకు అనుమతి ఉండగా 12,878 మంది అప్లై చేసుకున్నారు. మిగతా శాఖల పరిస్థితి ఇలానే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఒకసారి ప్రభుత్వ సాయం పొందితే ఐదేండ్లపాటు మరో సబ్సిడీ పథకానికి అనర్హులు అవుతారు. రూల్స్ఉండడంతో ఎక్కువ మంది రూ.2 లక్షలు, రూ.4 లక్షల యూనిట్ల వైపే మొగ్గు చూపినట్లు అభిప్రాయాలున్నాయి.
స్పీడ్‌గా వెరిఫికేషన్..
ఎంపీడీవో, మండల స్పెషల్ ఆఫీసర్, బ్యాంకు మేనేజర్, ఏపీఎం, కార్పోరేషన్‌కు చెందిన అధికారులతో కూడిన మండల కమిటీలు ప్రస్తుతం ఎంక్వైరీ చేస్తున్నాయి. ఆ తర్వాత వారు జిల్లా కమిటీకి సిపార్సు చేయనున్నారు. అక్కడి నుంచి జిల్లా కమిటీలో ఉండే కలెక్టర్ ఆధ్వర్యంలో అడిషనల్ కలెక్టర్, డీఆర్డీవో పీడీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులు, ఇండస్ట్రీయల్ జిల్లా మేనేజర్, లీడ్‌బ్యాంకు మేనేజర్లు తుది జాబితాను రూపొందించి జిల్లా ఇన్చార్జి మంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఆయన ఆమోదంతో లిస్ట్ఫైనల్ చేసి ఎంపికైన వారికి జూన్ 2న ప్రొసీడింగ్స్ అందించేలా ముందుకు సాగుతున్నారు.
పారదర్శకంగా ధృవీకరణ..
రాజీవ్ యువ వికాసం లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుంది. రూ.50 వేలు, రూ.లక్ష సాయం యూనిట్లకు అప్లికేషన్లు తక్కువగా వచ్చాయి. రూ.2 లక్షలు, రూ.4 లక్షల యూనిట్లకు ఎక్కువ మొత్తం అప్లై చేసుకోగా, రూల్స్మేరకు వెరిఫికేషన్ చేపడుతున్నాం. అర్హులైన వారికి లబ్ధి చేకూరుతుంది. ఎవరూ అపోహలు చెందవద్దు. రుణాలు ఇప్పిస్తామని దళారులు చెబితే నమ్మొద్దు.
రవీందర్, బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి, జనగామ