
కూకట్పల్లి, వెలుగు: ప్రధాని మోదీ కృషితో ప్రపంచంలో భారత్ మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందుతోందని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. కూకట్పల్లి వివేకానందనగర్‌కాలనీలో డివిజన్ బీజేపీ అధ్యక్షుడు ఎన్.వంశీరెడ్డి, హనుమాన్ శక్తి కేంద్రం ఇన్చార్జి పి.నాగేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మన్‌కీ బాత్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా స్వదేశీ వస్తువులను వాడాలని కోరారు. ఇందుకు అనుగుణంగా భారత ప్రభుత్వం జీఎస్టీని కూడా తగ్గించిందని చెప్పారు. కూకట్పల్లి నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జి మాధవరం కాంతారావు, సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు, డాక్టర్ కొరడాల నరేశ్ పాల్గొన్నారు.