రాకాస రెస్పాన్స్‌‌‌‌ బాగుంది

రాకాస రెస్పాన్స్‌‌‌‌ బాగుంది

సంగీత్ శోభ‌‌‌‌న్‌‌‌‌, న‌‌‌‌య‌‌‌‌న్ సారిక‌‌‌‌ జంటగా మానస శర్మ దర్శకత్వంలో నిహారిక కొణిదెల నిర్మించిన చిత్రం ‘రాకాస’.  శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి లభిస్తున్న స్పందన గురించి తెలియజేసేందుకు ప్రెస్‌‌‌‌మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత నిహారిక మాట్లాడుతూ ‘ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌ చేయాలనే ఉద్దేశంతో తీసిన మా చిత్రాన్ని చూసి ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. విడుదలైన ప్రతీ చోటా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మేం ఎక్కడైతే ప్రేక్షకులు ఎక్కువ నవ్వుతారు, ఎంజాయ్ చేస్తారు అనుకున్నామో ఆ సీన్స్‌‌‌‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది’ అని చెప్పారు.

‘‘పిల్లలతో సహా పేరెంట్స్‌‌‌‌ మా సినిమాకు వస్తున్నారు. అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు” అని హీరో సంగీత్ శోభన్ చెప్పాడు.  ఇది తనకెంతో ప్రత్యేకమై సినిమా అని, హిట్ టాక్ రావడం సంతోషంగా ఉందని నయన్ సారిక చెప్పింది.  ‘‘చందమామ కథ లాంటి సినిమా అని ముందు నుంచీ చెబుతున్నాం. అందుకు తగ్గ రెస్పాన్స్‌‌‌‌ థియేటర్స్‌‌‌‌లో చూసి ఆనందమేస్తోంది’’ అని డైరెక్టర్ మానస శర్మ అన్నారు.