
సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండే రాకేష్ మాస్టర్ మరణ వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది. రాకేష్ మాస్టర్ అసలు పేరు ఎస్. రామారావు . అయితే రాకేష్ మాస్టర్ పర్సనల్ లైఫ్ గురించి చర్చనీయాంశంగా మారింది. రాకేష్ మాస్టర్ భార్య ఎవరు? పిల్లలు ఎంతమంది అని చర్చించుకుంటున్నారు. అయితే భార్యా పిల్లలున్నా చనిపోయే వరకు అనాథాశ్రమంలోనే ఉంటున్న రాకేష్ మాస్టర్ జీవితగాథ కన్నీళ్లు తెప్పిస్తోంది
చాలా ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న రాకేష్ మాస్టర్ కు మూడు పెళ్లిళ్లు జరిగాయి. మొదటి భార్య ఎవరో పెద్దగా తెల్వదు కానీ. ఆమె రెండో భార్యకు ఇద్దరు పిల్లలు. కొడుకు చరణ్ అందరికీ తెలుసు. లాక్ డౌన్ లో తన కొడుకు చరణ్ తో కలిసి యూట్యూబ్ లో వీడియోలు చేసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో గొడవ వల్ల తన రెండో భార్య రాకేష్ మాస్టర్ నుంచి విడిపోయింది. తన వల్ల హాని ఉందని.. చనిపోయినా రావొద్దని తన రెండో భార్య చెప్పినట్లు రాకేష్ మాస్టర్ పలు ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు.
అప్పటి నుంచి రెండో భార్యకు దూరంగా ఉన్న రాకేష్ మాస్టర్ తర్వాత రెండేళ్ల కింద లక్ష్మీ అనే మహిళను మూడో పెళ్లి చేసుకున్నారు. అయితే ఆమె తన దగ్గరున్న డబ్బులన్నీ కాజేసి తన కుటుంబాన్ని నిలువెల్లా ముంచిందని.. పరువు ప్రతిష్టలను బజారున పడేసిందని ఇంటర్వ్యూలల్లో ఆరోపించారు రాకేష్ మాస్టర్. తనను జైల్లో పెట్టించాలని చూసిందని కూడా ఆరోపించారు. దీంతో ఆమెతోనూ రాకేష్ మాస్టర్ విడిపోయారు. తర్వాత మనోవేదనకు గురైన రాకేష్ మాస్టర్ అప్పటి నుంచి అబ్దుల్లాపూర్ మెట్ లోని ఓ అనాథశరణాలయంలో ఉంటున్నారు.
రాకేశ్ మాస్టర్ కళ్లను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు సమ్మతి తెలిపారు. జూన్ 19న బోరబండలో రాకేశ్ మాస్టర్ అంత్యక్రియలు జరగనున్నాయి.