ఈ పార్లమెంట్ సెషన్‌లోనే మద్దతు ధరపై చట్టం చేయాలి

ఈ పార్లమెంట్ సెషన్‌లోనే మద్దతు ధరపై చట్టం చేయాలి

కేంద్ర ప్రభుత్వానికి మరోసారి అల్టిమేటం ఇచ్చారు భారతీయ కిసాన్ యూనియన్ అధికార ప్రతినిధి రాకేశ్ టికైత్. ఈ పార్లమెంట్ సెషన్ లోనే మద్దతు ధరపై చట్టం చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే.. జనవరి 26 దగ్గర్లోనే ఉందని.. 4 లక్షల ట్రాక్టర్లు, రైతులు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ముంబై టూర్లో ఉన్న ఆయన.. కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో నీతిలేని, మోసకారి ప్రభుత్వం ఉందని ఫైరయ్యారు. రైతులను, కార్మికులను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తోందన్నారు టికైత్. రైతులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.