
రణ్‌వీర్‌సింగ్, అలియాభట్ జంటగా కరణ్‌జోహార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ’. ఈ మూవీ టీజర్‌ను మంగళవారం విడుదల చేశారు. గతంలో వచ్చిన పలు బాలీవుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ను గుర్తు చేసేలా కలర్‌ఫుల్‌గా ఉంది ఈ టీజర్. ఇందులో డైలాగ్స్ ఏవీ లేనప్పటికీ లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో తెరకెక్కిస్తున్నట్టు అర్థమవుతోంది. ధర్మేంద్ర, జయా బచ్చన్, షబానా అజ్మీ ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించారు. ప్రీతమ్ అందించిన మ్యూజిక్ ఆకట్టుకుంది. వయాకామ్18 స్టూడియోస్‌తో కలిసి ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్ దీన్ని నిర్మిస్తున్నారు. జులై 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు ఆరేళ్ల తర్వాత కరణ్ జోహార్ డైరెక్ట్ చేస్తుండడం, ‘గల్లీబాయ్’ తర్వాత రణ్‌వీర్, అలియా జంటగా నటిస్తున్న సినిమా కావడంతో అంచనాలు నెలకొన్నాయి.