Rakhi Sawant : బాలీవుడ్ నటి రాఖీ సావంత్‌ అరెస్ట్

Rakhi Sawant : బాలీవుడ్ నటి రాఖీ సావంత్‌ అరెస్ట్

బాలీవుడ్ నటి రాఖీ సావంత్‌ ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. మోడల్ షెర్లిన్ చోప్రా ఫిర్యాదు మేరకు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. రాఖీ సావంత్ తనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేసిందంటూ ఫిర్యాదులో పేర్కొంది. షెర్లిన్ ఫిర్యాదు ఆధారంగా రాఖీ సావంత్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

విచారణ కోసం రాఖీ సావంత్‌ ను అంబోలి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రాఖీ తన భర్త ఆదిల్ దుర్రానీతో కలిసి డ్యాన్స్ అకాడమీని ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభోత్సవం చేయాల్సి ఉంది. ఈలోగానే ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. రాఖీ సావంత్, షెర్లిన్ చోప్రా మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. గత ఏడాది నవంబర్‌లో ఒకరిపై మరొకరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్న విషయం తెలిసిందే.