
వరుస పరాజయాలు ఎదురైతే కెరీర్‌రో వెనుకబడిపోతారు హీరోయిన్లు. కానీ పడి లేచిన కెరటంలా ఎప్పటికప్పుడు ముందుకు దూసుకొస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. ఆమె కెరీర్ సూపర్ ఎక్స్‌ప్రెస్‌లా పరుగులు తీస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో తొమ్మిది సినిమాలు ఉన్నాయి. వాటిలో ఏడు ఈ సంవత్సరమే రిలీజ్ కానున్నాయి. వీటిలో శివకార్తికేయన్‌తో కలిసి నటించిన ‘అయలాన్’ ఒకటే సౌత్ మూవీ. మిగతావన్నీ బాలీవుడ్ చిత్రాలే. అటాక్, రన్‌వే 34, థ్యాంక్ గాడ్, డాక్టర్ జి, మిషన్ సిండ్రెల్లా, ఛత్రీవాలీ.. ఇవన్నీ ఈ ఇయర్ ఎండింగ్‌లోపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇంతవరకు పూజా హెగ్డేనే ఈ విషయంలో ఫాస్ట్‌గా ఉందనుకున్నారంతా. ఆమె నటించిన ఐదు సినిమాలు ఈ ఇయర్ విడుదలవుతున్నాయి. కానీ రకుల్ సినిమాలు అంత కంటే రెండు ఎక్కువే వస్తున్నాయి.బీటౌన్‌లో తనకెంత డిమాండ్ ఉందో ఈ లైనప్ చూస్తే అర్థమవుతోంది.