హీరోలు చేయొచ్చు.. హీరోయిన్లు చేయకూడదా?

హీరోలు చేయొచ్చు.. హీరోయిన్లు చేయకూడదా?

‘దే దే ప్యార్‌ దే’ చిత్రంతో బాలీవుడ్‌ లో హిట్టు కొట్టిన రకుల్ ప్రీత్ సింగ్… ‘మన్మథుడు 2’తో టాలీవుడ్‌ లో తన సక్సెస్‌ రేట్‌ ను మరింత పెంచుకోవాలనుకుం టోంది. నా గార్జున హీరోగా రాహుల్ రవీంద్రన్‌‌ తెరకెక్కించిన ఈ చిత్రం ఈ నె ల 9న విడుదల కానుంది. ఈ క్రమంలో రకుల్‌ కాసేపు ఇలా కబుర్లాడింది.

నాతో పాటు సినిమాలో నటించిన వాళ్లందరికీ నెల రోజుల ముందే మూవీకి సంబంధించిన నోట్స్ ఇచ్చేశారు. దాంతో సీన్స్, డైలాగ్స్​ ముందుగా ప్రాక్టీస్ చేసి ఒకరితో ఒకరు బాగా కనెక్టయిపోయారు. అందుకే ఈజీగా వర్క్​ చేసేశాం . అసలు షూటింగ్​ చేసిన ఫీల్ మాకు కలగలేదు. సినిమా పూర్తయ్యేంత వరకూ ఎవరూ టెన్షన్ ఫీల్ అవడం కాని, అలసిపోవడం కాని జరగలేదు. అదంతా రాహుల్ ఘనతే.

‘వెంకటాద్రి ఎక్స్‌‌ప్రెస్ ’ నుంచి నాకు రాహుల్ తో పరిచయం ఉంది. ఈ సినిమాకి తను చాలా కష్టపడ్డాడు. ఎంతో మంచి వ్యక్తి. అందరినీ మంచి ఫన్ మూడ్ లో ఉంచి పని చేయిస్తాడు. ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ కలగనివ్వడు. అదే అతని స్ఫెషాలిటీ.

నాగ్​ సార్​ చాలా సపోర్ట్ చేశారు. స్టో రీకి చాలా ఇంపార్టెన్స్​​ఇస్తారాయన. తన పాత్ర కి మాత్రమే ప్రాధాన్యతనివ్వాలని ఆశపడరు. చాలా మెచ్యూర్ డ్‌ గా ఉంటారు. ఒక పాట చిత్రీకరణకు స్వి ట్జర్లాండ్ వెళ్లాం. అక్కడ మొత్తం టీమ్‌ తో పాటు వర్క్​ చేశారాయన. ఆయనతో కలిసి పని చేయడం అమేజింగ్‌ గా అనిపించింది.

ఈ సినిమాలో అవంతికగా నా రోల్ ఎంటర్‌ టైనింగ్‌ గా ఉండటమే కాదు… చాలా ఎనర్జిటిక్‌‌గా, మెచ్యూర్ డ్‌ గా కూడా ఉంటుంది. విదేశాల్లో చదువుకున్న అమ్మాయి. చిలిపి పిల్ల. కానీ చాలా సాలిల్‌‌గా ఆలోచిస్తుంది. ఆచి తూచి ని ర్ణయాలు తీసుకుం టుంది. ఈ పాతికేళ్ల అమ్మాయితో నలభయ్యేళ్ల వ్యక్తి లవ్‌ లో పడితే ఎలా ఉంటుందనేది కాన్సెప్ట్. చాలా ఇంటరెస్టిం గ్‌ గా అనిపించిం ది ఓకే అన్నాను.

మా సినిమా ఎలా వచ్చిందో చూశాను కానీ దీనికి మూలం అయిన ఫ్రెంచి మూవీ చూడలేదు. దానికి, దీనికి స్క్రిప్టులో చాలా తేడా ఉంది. ఈ మూ వీలో సిస్టర్ , మదర్ సెం టిమెంట్ , కామెడీ, రొమాన్స్​ ఇలా అన్ని రకాల జానర్స్​ ఉంటాయి. అది వేరే. ‘మన్మథుడు 2’ అందరికీ నచ్చే సినిమా. ఫ్యామిలీ మొత్తం వెళ్లి ఎంజాయ్ చెయ్యొచ్చు.

అమ్మాయిలు స్మోక్ చెయ్యడం, బీర్​ తాగడం లాంటివి బయట జరుగుతూనే ఉన్నాయి. అందుకే సినిమా స్ర్కిప్టుల్లో కూడా చాలా మార్పులు చేస్తున్నారు. అయినా హీరోయిన్లు స్క్రీన్ మీద అలా కనిపిస్తే తప్పేం టి? హీరోలు చేస్తే తప్పు కాదు కాని, హీరోయిన్స్​ చేస్తే తప్పా? అయినా అది నా రియల్ క్యారెక్టర్​ కాదు, సినిమాలో అమ్మాయి క్యారెక్టర్ .

ఒకే ఫ్యామిలీలో రెండు తరాల హీరోలతో – హీరోయిన్‌‌గా నటిం చినందుకు నేను లక్కీగా ఫీలవుతున్నాను. ఇలా నేను నటించడం ఇది రెండోసారి. బ్రూస్ లీ సినిమాలో- చరణ్‌‌తో, చిరంజీవి గారితో నటించాను. అలాగే చైతూతో నటించాను, ఇప్పుడు నాగ్‌ గారితో నటించాను.

నాకు హీరో ముఖ్యం కాదు. నా పాత్ర ముఖ్యం . ఎందుకంటే హీరో పాత్ర అయినా, హీరోయిన్ క్ యారెక్టర్ అయినా స్టో రీని బట్టే ఉంటాయి. అందుకే నాగ్​ సార్​తో చేసిన వెం టనే, నితిన్ తో చేస్తున్నా. ఇద్దరూ వేర్వేరు వయసున్న​ హీరోలు.

ప్రస్తుతం రీమేక్‌‌లు ఎక్కువగా వస్తున్న మాట నిజమే. రీమేక్ సినిమాలకు నేనేమీ వ్యతిరేకిని కాను. కానీ నా సినిమా రీమేక్ అయితే మాత్రం అందులో నేను నటించను. అదే రోల్ మళ్లీ చెయ్యాలంటే నాకు చాలా బోర్​. అలాగే లేడీ ఓరియెంట్‌ చిత్రాలు చేయడానికి కూడా నేను రెడీనే. కానీ మంచి కథ దొరకాలి కదా!