లాక్ డౌన్ లో బోరింగ్: ర‌కుల్ ప్రీత్ సింగ్ వెరైటీ టీ ష‌ర్ట్ చాలెంజ్.. వీడియో

లాక్ డౌన్ లో బోరింగ్: ర‌కుల్ ప్రీత్ సింగ్ వెరైటీ టీ ష‌ర్ట్ చాలెంజ్.. వీడియో

క‌రోనా వైర‌స్ ఎఫెక్ట్ తో ప్ర‌పంచమంతా ఎక్క‌డిక‌క్క‌డ ఆగిపోయింది. వైర‌స్ వ్యాప్తిని క‌ట్ట‌డి చేసేందుకు లాక్ డౌన్ అమ‌లు చేస్తోంది కేంద్ర ప్ర‌భుత్వం. సినిమా షూటింగ్స్ కూడా ఆగిపోయి.. హీరోలు, హీరోయిన్లు, ఇత‌ర సెల‌బ్రెటీలు ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. దీంతో కొంత మంది హీరోలు ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తూ స్టే హోం, స్టే సేఫ్ అంటూ పిలుపునిస్తున్నారు. ఈ లాక్ డౌన్ తో ఇళ్ల‌కే ప‌రిమిత‌మైన జ‌నాలు బోర్ కొడుతుండ‌డంతో సోష‌ల్ మీడియాలో ర‌క‌రకాల చాలెంజెస్ పేరుతో స‌ర‌దాగా టైమ్ పాస్ చేస్తున్నారు. సెల‌బ్రెటీలు కూడా ఇదే బాట‌లో ప‌య‌నిస్తున్నారు.

త‌ల‌కిందులుగా నిల‌బ‌డి టీ ష‌ర్ట్ వేసుకునే చాలెంజ్

టాలీవుడ్ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ వెరైటీగా టీ ష‌ర్ట్ చాలెంజ్ తో త‌న ఇన్ స్టాగ్రామ్ లో వీడియో పోస్ట్ చేసింది. త‌ల‌కిందులుగా నిల్చుని.. టీష‌ర్ట్ తొడుక్కుని మీరూ ట్రై చేయండంటూ త‌న ఫ్రెండ్స్ ని ట్యాగ్ చేసింది. రెగ్యుల‌ర్ గా టీష‌ర్ట్ తొడుక్కోవ‌డం బోర్ గా ఉంద‌ని చెబుతూ క్యాప్ష‌న్ పెట్టి.. టైట్ యోగా డ్ర‌స్ లో ఉన్న త‌న వీడియోను ఇన్ స్టాలో పెట్టింది. #quarantinelife #weekendchallenge అన్న హ్యాష్ ట్యాగ్స్ తో త‌న ట్రైన‌ర్ అనుష్క ప‌ర్వాని, బాలీవుడ్ న‌టి ఆకాంక్ష రంజ‌న్ క‌పూర్, రియా చ‌క్ర‌వ‌ర్తికి చాలెంజ్ చేసింది ర‌కుల్. స్ట్రాంగ్ గా ఉండ‌డ‌మే సెక్సీ అంటూ #strongisthenewsexy #strongereveryday హ్యాష్ ట్యాగ్స్ తో వీడియో పోస్ట్ చేసింది. శ‌నివారం ఉద‌యం ర‌కుల్ ఈ వీడియో షేర్ చేసిన ఆరు గంట‌ల్లోనే ప‌ది ల‌క్ష‌ల వ్యూస్ వ‌చ్చాయి. కొద్దిసేప‌టికే ఆకాంక్ష క‌పూర్ ఆ చాలెంజ్ నే యాక్సెప్ట్ చేసిన‌ట్లు కామెంట్ చేసింది.