దక్షిణాది సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజనీకాంత్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన బయటకు వస్తే చాలు.. ఫొటోలు, ఆటోగ్రాఫ్‌ల కోసం వేలాది మంది అభిమానులు ఎగబడతారు. అలాంటి స్టార్ హీరోకు ఒక చోట ఘోరమైన అవమానం ఎదురైందట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ ఆశ్రమం 45వ వార్షికోత్సవం, ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ 70వ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న రజనీకాంత్.. అక్కడ తనకు ఎదురైన ఒక క్రేజీ మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్‌ను పంచుకున్నారు.
రెండు రోజులు అనుకుంటే..
గతంలో ఒకసారి బెంగళూరులోని ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ ఇంటర్నేషనల్ సెంటర్‌కు వెళ్లానని రజనీకాంత్ తెలిపారు. అక్కడి పచ్చదనం, సరస్సు, ఆనందంగా నవ్వుతూ కనిపించే ప్రజలు, ఏనుగులు, గుర్రాలు చూసి ఆయన ఫ్లాట్ అయిపోయారు. కేవలం రెండు రోజులు ఉందామని వెళ్లిన తలైవా.. ఏకంగా 15 రోజులు అక్కడే ఉండిపోయానని చెప్పుకోచ్చారు. .
ఒక్కడు కూడా చూడలేదు!
ఆ సమయంలో గురుదేవ్ రవిశంకర్.. రజనీకాంత్‌ను ఆశ్రమం అంతా ఒక రౌండ్ వేసి రమ్మన్నారని చెప్పారు. సాధారణంగా పెద్ద స్టార్ కాబట్టి జనాలు తనపై పడిపోతారని, ముఖ్యంగా అక్కడ తమిళనాడు వాళ్లు వందల సంఖ్యలో ఉండటంతో రజనీ కాస్త టెన్షన్ పడ్డారు. కానీ సీన్ కట్ చేస్తే.. అక్కడ అసలు ఊహించని ట్విస్ట్ ఎదురైంది.
నేను అబద్ధం చెప్పట్లేదు.. వందలాది మంది ఉన్నా కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా నా వైపు చూడలేదు. నేనే అందరికీ చేయి ఊపుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఫొటోలు, ఆటోగ్రాఫ్‌లు దేవుడెరుగు.. కనీసం నాతో మాట్లాడలేదు కూడా అంటూ చెప్పుకొచ్చారు రజనీకాంత్. ఎంతోమంది రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలను కలిసిన నాలోని ‘అహాన్ని’ (Ego) ఆ సంఘటన ఒక్కసారిగా పూర్తిగా అణచివేసింది అని రజనీకాంత్ నవ్వుతూ చెప్పారు.
ఆధ్యాత్మిక స్టార్‌డమే సుప్రీమ్!
ఈ అనుభవంతో తన కళ్లు తెరుచుకున్నాయన్న రజనీకాంత్.. ఆధ్యాత్మిక శక్తి ముందు నా సినిమా స్టార్‌డమ్ చాలా చిన్నది. ఈ సినీ గ్లామర్ ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. కానీ ఆధ్యాత్మిక స్టార్‌డమ్ అనేది సుప్రీమ్. మనిషి చనిపోయిన తర్వాత కూడా ఆ గుర్తింపు శాశ్వతంగా ఉంటుంది, ఇంకా పెరుగుతుంది అంటూ లైఫ్ ఫిలాసఫీని చెప్పుకొచ్చారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమంలో రజనీకాంత్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
VIDEO | Recalling his earlier visit to the Art of Living, actor Rajinikanth (@rajinikanth) brought the house down with his humorous take, said, 'nobody even looked at me'.#Rajinikanth pic.twitter.com/JPZGgxtLMv
— Press Trust of India (@PTI_News) May 12, 2026
