మరో డేట్ ఇవ్వాలని ఈడీ ని కోరిన రకుల్ ప్రీత్

V6 Velugu Posted on Sep 02, 2021

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణకు రకుల్ ప్రీత్ సింగ్ దూరమయ్యేలా కనిపిస్తోంది. షెడ్యూల్ ప్రకారం ED జారీ చేసిన నోటీసుల ప్రకారం సెప్టెంబర్ 6న రకుల్ ప్రీత్‌సింగ్ విచారణకు హాజరు కావాలి. అయితే అనివార్య కారణాల కారణంగా ఈడీ విచారణకు హాజరు కాలేనంటూ రకుల్ ఈడీ అధికారులను కోరింది.

విచారణకు తాను హాజరయ్యేందుకు మరో డేట్ ఇవ్వాలని రకుల్ ప్రీత్‌సింగ్ ED అధికారులను కోరింది. అటు ఎక్సైజ్ అధికారుల విచారణలో మాత్రం రకుల్ ప్రీత్ సింగ్ పేరు లేకున్నా.. డ్రగ్స్ కేసుతో పలు లింకులు ఉన్న కారణంగా రకుల్ ప్రీత్ సింగ్‌కు ED నోటీసులు జారీ చేసింది.

Tagged Rakul Preet Singh, attend , asks ED, another date

Latest Videos

Subscribe Now

More News