నార్సింగి డ్రగ్స్ కేసు.. మరో 28 మందికి నోటీసులు

నార్సింగి డ్రగ్స్ కేసు.. మరో 28 మందికి నోటీసులు

హైదరాబాద్, వెలుగు: సినీ నటి రకుల్  ప్రీత్  సింగ్‌‌ ‌‌  తమ్ముడు అమన్  ప్రీత్  సింగ్  డ్రగ్స్  కేసులో నార్సింగి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మరో 28 మంది డ్రగ్స్  కస్టమర్లను గుర్తించి వారికి నోటీసులు జారీ చేశారు. వారిలో ఐటీ ఉద్యోగులు, రియల్‌‌ ఎస్టేట్‌‌ ‌‌ , ప్రముఖ వ్యాపారవేత్తల కొడుకులు ఉన్నట్లు గుర్తించారు. రెగ్యులర్​గా డ్రగ్స్‌‌కొనుగోలు చేస్తున్నట్లు ఆధారాలు లభించడంతో నోటీసులు జారీ చేశారు. నిందితుల్లో 13 మందిని ప్రశ్నించారు. రాజేంద్రనగర్‌‌ ‌‌  లోని ఓ అపార్ట్ మెంట్‌‌ ‌‌ లో ఈనెల 15న యాంటీ నార్కోటిక్స్  బ్యూరో, సైబరాబాద్  ఎస్‌‌ ‌‌ఓటీ పోలీసులు జాయింట్ ఆపరేషన్  చేసిన సంగతి తెలిసిందే.

ఈ వ్యవహారంలో అంతర్జాతీయ డ్రగ్స్  పెడ్లర్‌‌ ‌‌  నైజీరియన్ డివైన్ ఎబుక సుజీ గ్యాంగ్‌‌ ‌‌  కు చెందిన ఒనౌహ బ్లెస్సింగ్  సహా డ్రగ్‌‌ ‌‌  సప్లయర్స్‌‌అజీజ్ నహీం, సత్య వెంకట గౌతమ్, కారు డ్రైవర్ వరుణ్‌‌ కుమార్, కొరియోగ్రాఫర్  మహ్మద్  మహబూబ్  షరీఫ్‌‌, అమన్‌‌ ‌‌  ప్రీత్‌‌సింగ్‌‌ ‌‌ సహా మరో 13 మంది కస్టమర్లను అరెస్టు చేశారు. అమన్  ఫ్రెండ్స్ ను ప్రశ్నించారు. వారు ఇచ్చిన సమాచారంతో డ్రగ్స్ సప్లయర్స్‌‌ ‌‌  నెట్‌‌ ‌‌  వర్క్​ను ఛేదిస్తున్నారు. దీంతో పాటు ఏడు పబ్‌‌ ల నిర్వాహకుడు నిఖిత్  ధామన్‌‌ కస్టమర్ల వివరాలను కూడాసేకరిస్తున్నారు. పబ్‌‌ ‌‌ కు వచ్చే రెగ్యులర్  కస్టమర్లలో ఎంత మందికి డ్రగ్స్‌‌సప్లయ్  చేశారో దర్యాప్తు చేస్తున్నారు.