హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్ పోలీసు స్టేషన్‌లో మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ హైకోర్టులో పిటిషన్ వేశారు.
దీనిని జస్టిస్ ఇ. తిరుమలా దేవి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పోలీసులు చట్ట విరుద్ధంగా కేసు నమోదు చేశారని, దీన్ని కొట్టివేయాలని కోరారు. పిటిషన్‌పై విచారణ ముగిసేదాకా దర్యాప్తును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. వాదనలను విన్న న్యాయమూర్తి పోలీసుల వివరణ కోరుతూ విచారణను 8వ తేదీకి వాయిదా వేశారు.
